https://oktelugu.com/

YS Vijayamma : ఇంతకీ విజయమ్మ ఓటేసేది ఎక్కడ?

ఇప్పుడు విజయమ్మ ఓటు ఎక్కడుందన్నది ప్రశ్ని. ఆమె ఓటు కడప జిల్లా పులివెందులలో ఉందా లేక హైదరాబాద్ కి ఆమె కూడా ఓటుని షిఫ్ట్ చేసుకున్నారా అన్నదే చర్చ.

Written By:
  • Dharma
  • , Updated On : April 27, 2023 / 02:13 PM IST
    Follow us on

    YS Vijayamma : వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ విజయమ్మ ఓ గృహిణి మాత్రమే. వైఎస్ఆర్ అకాల మరణంతో ఆమె పాత్ర పెరిగింది. అప్పటివరకూ భర్తతో అడపాదడపా వేదికలు పంచుకుంటూ వచ్చిన ఆమె..భర్త మరణంతో బయటకు రావాల్సి వచ్చింది. పిల్లల కోసం అనివార్యంగా మారింది. కుమారుడు జగన్ పార్టీని ప్రారంభించడంతో గౌరవ అధ్యక్షురాలి పదవి తీసుకోవాల్సి వచ్చింది. కుమారుడి విషయంలో గురుతర బాధ్యతను తీసుకున్న ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కుమార్తె షర్మిళకు అండగా నిలుస్తున్నారు. ఆమె పార్టీకి గౌరవ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. కుమార్తె తరుపున జనంలోకి వస్తున్నారు. కుమార్తె తరఫున నిరసనలు చేస్తున్నారు. కానీ ఆమె స్థానికత అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. కుమార్తె తరుపున దూకుడుగా వ్యహరిస్తుండడమే అందుకు కారణం.

    ఇప్పటివరకూ పులివెందులలో..
    వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది పులివెందుల. రాయలసీమ రాజకీయాలను ప్రభావితం చేసేంతటి శక్తివంతమైన నియోజకవర్గం. వైఎస్సార్ భార్యగా విజయమ్మ ఆ నియోజకవర్గానికి చెందిన వారే. అటు పుట్టినిల్లు కూడా రాయలసీమే. అనంతపురం జిల్లాలో పుట్టినిల్లు ఉంది. వైఎస్ హయాం నుంచి మొన్నటి 2019 ఎన్నికల వరకూ విజయమ్మ, షర్మిళ అందరూ పులివెందులలోనే ఓటేసేవారు. విపక్ష నేతగా, ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం హైదరాబాద్ లో ఉన్న వారి ఓటు మాత్రం పులివెందులలోనే కొనసాగేది. అయితే ఇప్పుడు కుమార్తె షర్మిళ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఓటు ఎక్కడ ఉందన్నదే ప్రశ్న.

    తెలంగాణ కోడలిగా షర్మిళ..
    వైఎస్సార్టీపీని ప్రారంభించే క్రమంలో షర్మిళ స్థానికత అంశంపై దుమారం రేగింది. ఏపీకి చెందిన మహిళ తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తారన్నప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ఆమె తాను తెలంగాణా కోడలిని అని చెప్పి తన పాలిటిక్స్ ని లోకల్ గా క్లెయిం చేసుకునే పనిలో ఉన్నారు. ఆమె పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఆమె హైదరాబాద్ లో జీవిస్తున్నా ఆమె ఓటు హక్కు ఎక్కడ అన్నది ఇపుడు ప్రశ్నగా ముందుకు వస్తోంది. షర్మిల పార్టీ తెలంగాణా కోసం పెట్టారు కాబట్టి ఆమె ఓటు హక్కు హైదరాబాద్ కి మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఆమెకు లోకల్ ప్రూవ్ ని ఇస్తుంది. పైగా విమర్శలు కూడా వస్తాయి. ఈపాటికే షర్మిల ఆ పని చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు.

    కొడుకా? కుమార్తె?
    ఇప్పుడు విజయమ్మ ఓటు ఎక్కడుందన్నది ప్రశ్ని. ఆమె ఓటు కడప జిల్లా పులివెందులలో ఉందా లేక హైదరాబాద్ కి ఆమె కూడా ఓటుని షిఫ్ట్ చేసుకున్నారా అన్నదే చర్చ. అలా కనుక జరిగితే ఏపీతో ఆమెకు రాకీయ బంధం పూర్తిగా తెగిపోయినట్లే అంటున్నారు. అలా కాదు ఏపీలో వైసీపీ పార్టీ ఉంది. దానికి అండగా ఉండాలంటే అక్కడ ఓటు కొనసాగించే చాన్స్ ఉంది. అలాయితే మాత్రం వైఎస్సార్టీపీ గౌరవ అధ్యక్షురాలిగా విమర్శ ఖాయం. ప్రస్తుతం తెలంగాణలో షర్మిళ పార్టీని రాజకీయ పక్షాలు లైట్ తీసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో.. సీరియస్ గా తీసుకుంటే మాత్రం విజయమ్మ ఓటు ఒక ఇష్యూగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.