https://oktelugu.com/

Summer Food : వేడిని తట్టుకునే ఆహారాలేంటో తెలుసా?

ఎండాకాలంలో పుచ్చకాయ తినడం చాలా మంచిది. ఇందులో ఎక్కువ శాతం నీరు ఉండటంతో శరీరం డీ హైడ్రేడ్ కాకుండా చూస్తుంది. ఇందులో తొంభై శాతం నీరే ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 11, 2023 5:05 pm
    Follow us on

    Summer Food : వేసవి కాలంలో వేడి గాలులు వీస్తుంటాయి. దీంతో నోరు ఎండిపోతుంది. దాహం విపరీతంగా వేస్తుంది. నీళ్లు తాగకపోతే శరీరం డీ హైడ్రేడ్ కు గురవుతుంది. ఫలితంగా వడదెబ్బ సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈనేపథ్యంలో ఒంట్లో వేడి పెరగడంతో దాన్ని తగ్గించుకునే ఆహారాలు తీసుకుంటే మంచిది. అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

    వేడి కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు, గ్యాస్ వంటివి ఇబ్బంది పెడతాయి. పండ్లు, కూరగాయలు తీసుకునేందుకే మొగ్గు చూపాలి. మసాలాలు, కారం, ఉప్పు, నూనెలు అధికంగా వాడితే మన సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. శరీరాన్ని చల్లబరిచే వాటిని తీసుకుంటేనే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేదంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి.

    ఎండాకాలంలో పుచ్చకాయ తినడం చాలా మంచిది. ఇందులో ఎక్కువ శాతం నీరు ఉండటంతో శరీరం డీ హైడ్రేడ్ కాకుండా చూస్తుంది. ఇందులో తొంభై శాతం నీరే ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సీజనల్ గా దొరికే మామిడిపండ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదే. ఇందులో రోగనిరోధక శక్తి ఉంటుంది. అందువల్ల వీటిని తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    ఆకుకూరలతో చేసిన సలాడ్లు తీసుకుంటే చాలా మంచిది. కర్బూజలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది వేడిని సులభంగా దూరం చేస్తుంది. ఇందులో మెగ్నిషియం, డైటరీ ఫైబర్ ఉండటం వల్ల శరీరాన్నిడీ హైడ్రేడ్ కాకుండా చూస్తుంది. అరటి పండులో కూడా పోషకాలు మెండు. పొటాషియం, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండటంతో ఇది కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

    వేసవిలో లభించే తాటిముంజలు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్ట్రాబెర్రీలు కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో కూడా నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.