Blood Circulation: చాలా మంది ప్రస్తుతం బ్లడ్ సర్క్యులేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు, డయాబెటీస్, బీపీ, రెనాడ్స్ వంటి సమస్యల వల్ల బ్లడ్ సర్క్యులేషన్‌లో మార్పులు వస్తాయి.రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే గుండె, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాల్లో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇక శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కాళ్లు, చేతులు నొప్పులు, కండరాల తిమ్మిర్లు, జీర్ణ సమస్యలు, కాళ్లు, చేతులు చల్లబడటం, తిమ్మిర్లు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయట. మరి రక్త ప్రసరణను మెరుగు పరుచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
సిట్రస్ పండ్లు:
సిట్రస్ పండ్లు తింటే రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. ఈ పండ్లలో ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కార్బోహైడ్రేట్లు లేకుండానే ఖనిజాలు, విటమిన్లు అందిస్తాయి ఈ సిట్రస్ పండ్లు. సిట్రస్ పండ్లు తినడం వల్ల రక్త నాళాల్లో ఏర్పడే గడ్డలు కూడా తొలిగిపోతాయి.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ అంటే కూడా చాలా మందికి ఇష్టం. ఇవి తింటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. వీటిల్లో మెగ్నీషియం, పొటాషియం, అర్జినైన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను క్లియర్ చేసి.. రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో తోడ్పడతాయి.
ఉల్లిపాయలు:
ఉల్లిపాయలు తింటే కూడా రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల రక్త పోటు కంట్రోల్ అవుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలం అవుతుంది. ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగు పరిచి ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటి కోసం నాలుగు వారాల పాటు ఉల్లిపాయలు తినాలి అంటున్నాయి అధ్యయనాలు.
వెల్లుల్లి:
వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. వీటితో పాటు శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగు అవుతుంది.