Blood Pressure: రక్తప్రసరణ సరిగా లేకపోతే ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలుసా?

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్తప్రసరణ కాకపోవడం వల్ల గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో వందకు పైగా రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Written By: Srinivas, Updated On : April 27, 2023 5:25 pm
Follow us on

Blood Pressure: మన శరీరంలో రక్తం సరఫరా కావడానికి రక్తనాళాలు ఉపయోగపడతాయి. గుండె మన శరీరంలోని ఐదు లీటర్ల రక్తాన్ని గంటకోసారి ఫిల్టర్ చేస్తుంది. ఇలా రక్తం సాఫీగా వెళ్లడానికి అనువైన వాతావరణం లేకపోతే గుండె జబ్బుల ముప్పు రావచ్చు. దీంతో మనం తినే ఆహార పదార్థాల నుంచి వచ్చే మలినాలను శుభ్రం చేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్తప్రసరణ సరిగా జరగక గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతుంది.

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్తప్రసరణ కాకపోవడం వల్ల గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో వందకు పైగా రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా కొవ్వు పేరుకుపోతే శరీర అవయవాల పనితీరు కూడా మందగిస్తుంది. దీంతో రక్తం శుభ్రపరచుకోకపోతే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

ఇలాంటి ఇబ్బందులను నివారించాలంటే ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలున్నాయి. రక్తంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కొవ్వు, మలినాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కిడ్నీలు చెడిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రక్తసరఫరా మెరుగు పడటానికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన ఆహార అలవాట్లను మార్చుకోకపోతే తిప్పలు తప్పవు. రక్తంలోని మలినాలు బయటకు పంపించే క్రమంలో మలినాలు, కొవ్వులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. జుట్టు రాలిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే రక్తప్రసరణ సరిగా జరగడం లేదని తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో పలు రకాల మందులు ఉండటంతో వాటిని వాడుకోవడం మంచిది.