https://oktelugu.com/

Samantha: సమంతతో పాటు గుడి కట్టించుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?

అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ అంటే కొందరు పడి చచ్చేవారు. ఆమె సినిమాలను విడిచిపెట్టేవారు కాదు. తమ అభిమాన హీరోయిన్ ను ఫ్యాన్స్ ఎప్పటికీ ఆరాధించేవారు. అయితే ఆమె కోసం ఫ్యాన్స్ ప్రత్యేకంగా గుడి కట్టించారు. 1991లో ఖుష్బూ చిన తండి సినిమా షూటింగ్ లో ఉండగా ఆమె కోసం అభిమానులు తిరుచ్చిలో టెంపుల్ నిర్మించారట.

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2023 / 05:20 PM IST
    Follow us on

    Samantha: సినిమా నటులపై ఎవరికైనా అభిమానం ఉంటుంది. వారి అభిమానానికి గుర్తుగా వారి ఫస్ట్ షో రోజూ సినిమా చూస్తారు. లేదా ఆ రోజు వారి కటౌట్లు ఏర్పాటు చేసి దండేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి పుట్టినరోజునాడు అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ ఉంటారు. కానీ తమిళనాడు అభిమానులకు ఇండస్ట్రీలోని సినిమా నటులపై పీకలమీదిదాకా ప్రేమ ఉంటుంది. వారి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో కొందరు తాము అభిమానించే తారల కోసం ప్రత్యేకంగా గుడి కట్టారు. ఈ సంస్కృతి మొన్నటి వరకు కోలీవుడ్లోనే ఉందనుకున్నాం.. కానీ ఇప్పుడు టాలీవుడ్ కి పాకింది. లేటేస్టుగా ఇక్కడ సమంత కోసం ఓ వ్యక్తి గుడి కట్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్లు గుడి కట్టించుకున్నారు?

    ఖుష్భూ:
    అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ అంటే కొందరు పడి చచ్చేవారు. ఆమె సినిమాలను విడిచిపెట్టేవారు కాదు. తమ అభిమాన హీరోయిన్ ను ఫ్యాన్స్ ఎప్పటికీ ఆరాధించేవారు. అయితే ఆమె కోసం ఫ్యాన్స్ ప్రత్యేకంగా గుడి కట్టించారు. 1991లో ఖుష్బూ చిన తండి సినిమా షూటింగ్ లో ఉండగా ఆమె కోసం అభిమానులు తిరుచ్చిలో టెంపుల్ నిర్మించారట. తన కోసం గుడి కట్టడం చూసి ఖుష్బూ షాక్ తిందట.

    హన్సిక:
    చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక తెలుగులో ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత పలు తమిళ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగారు. వారి అభిమానానికి గుర్తుగా చెన్నై శివారులో ఓ విగ్రహాన్ని తయారు చేసి ఆమె కోసం గుడి కట్టారట.

    నమిత:
    తెలుగులో ‘సొంతం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తరువాత ‘జెమిని’ సినిమాతో ఫేమస్ అయింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరింగింది. ఈ సందర్భంగా ఆమెకు కోయంబత్తూరు, తిరునవెల్లితో పాటు మొత్తం మూడు గుళ్లు కట్టించారు.

    నిథి అగర్వాల్:
    తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫేమస్ అయిన నిథి అగర్వాల్ కు తమిళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆమెకు చెన్నైలో గుడికట్టారు.

    నగ్మా:
    1990ల్లో హీరోయిన్ గా సంచలనాల సినిమాలు తీసిన నగ్మాకు తమిళంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. దీంతో ఆమెకు తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్లు ఆలయాలు నిర్మించారు.

    సమంత:
    ఇన్నాళ్లు తమిళులే కాదే మేం కూడా వీరాభిమానులమై అని చాటి చెబుతున్నారు తెలుగు ఫ్యాన్స్. ఆమె కోసం బాపట్లలో ఓ విగ్రహాన్ని తయారు చేశారు. ఆమెకు ఓ గుడి కట్టి అందులో ప్రతిష్టిస్తారని చెబుతున్నారు. సందీప్ అనే వీరాభిమాని తన ఇంటిలోనే సమంతకు గుడి కట్టడం విశేషం.