Drinking Water : మంచినీళ్లు తాగడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

Drinking Water : మనం ఆరోగ్యంగా ఉండాలంటే తిండి ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే. ఈ నేపథ్యంలో నీళ్లు తాగడం ఓ క్రమపద్ధతిలో తాగాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. దీంతో మంచినీళ్లు తాగడానికి ప్రత్యేక సమయం చూసుకోవాలి. నీరు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మనలో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగుతుంటారు. అలా చేయడం మంచిది కాదు. నీరు తాగేందుకు అనువైన సమయం చూసుకుంటే మంచిది. భోజనం […]

Written By: Srinivas, Updated On : April 19, 2023 4:25 pm
Follow us on

Drinking Water : మనం ఆరోగ్యంగా ఉండాలంటే తిండి ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే. ఈ నేపథ్యంలో నీళ్లు తాగడం ఓ క్రమపద్ధతిలో తాగాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. దీంతో మంచినీళ్లు తాగడానికి ప్రత్యేక సమయం చూసుకోవాలి. నీరు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మనలో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగుతుంటారు. అలా చేయడం మంచిది కాదు. నీరు తాగేందుకు అనువైన సమయం చూసుకుంటే మంచిది.

భోజనం చేసే సమయంలో..

భోజనం చేసే సమయంలో నీళ్లు తాగకూడదు. భోజనానికి అరగంట ముందు తాగాలి. భోజనం తరువాత గంటన్నర ఆగి అప్పుడు తాగాలి. అంతేకాని భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. మనం తినేటప్పుడు లోపల యాసిడ్ తయారవుతుంది. ఇది మనం తిన్న పదార్థాలను జీర్ణం చేస్తుంది. దీంతో మనం నీళ్లు తాగితే యాసిడ్ తో కలవడం వల్ల పదార్థాలు త్వరగా జీర్ణం కావు. అందుకే భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిది కాదు.

ప్లాస్టిక్ బాటిళ్లో వద్దు

మనలో చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లను నీళ్లు తాగేందుకు ఉపయోగిస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరం. దీంతో క్యాన్సర్ వచ్చే ముప్పు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం సురక్షితం కాదు. ఈ విషయం తెలియక చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఏర్పడే ఇబ్బందులు ఉండటంతో ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు రాగి వాటిని ఉపయోగించుకోవాలి.

ఉదయం లేవగానే..

ఉదయం లేవగానే లీటరున్నర నీళ్లు తాగాలి. దీంతో మన ఆరోగ్యం బాగుంటుంది. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల మనం తాగే నీళ్లు దివ్యౌషధంలా పనిచేస్తాయి. దీని వల్ల మన ఒంట్లో జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఉదయం మనం తాగే నీళ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.