West Asia Countries: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ లక్ష్యంగా మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా విస్తరిస్తోంది. పాలస్తీనాలోని హమాస్‌ను అంతం చేయడానికి గాజాపై భీకర దాడులు చేసింది. తర్వాత ఇరాన్‌లో ఉన్న హమాస్ చీఫ్‌ను మట్టు పెట్టింది. దీంతో ఇరాన్, హెజ్‌బొల్లా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతీకారం తీసుకుంటామని హెజ్‌బొల్లా హెచ్చరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్దమవుతున్న విషయాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై దాడిచేసింది. వారం రోజుల్లోనే హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాతోపాటు అతని కొడుకు, కూతురు, అల్లుడును కూడా హతమార్చింది. దీంతో ఇరాన్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఏకకాలంలో 100కుపైగా క్షిపుణులతో దాడిచేసింది. దీంతో ప్రతిదాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్‌ను కట్టడి చేస్తోంది. తొందరపడొద్దని సూచిస్తోంది. ఇరాన్ వద్ద అణుబాంబులు ఉండడంతోనే ఇపుపడు ఇజ్రాయెల్, అమెరికా భయంతో వణుకుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు దాడి చేయలేదు. లెబనాన్ మాత్రం దాడుల తీవ్రత పెంచింది. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ నేరుగా యుద్ధం ప్రారంభిస్తే ఇరాన్ చమురు స్థావరాలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అణస్థావారాలపై దాడి చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ దేశాలకు మద్దతుగా అమెరికా, బ్రిటన్, రష్యా కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో మూడో 6పపంచయుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాచర్యం(మిడిల్ ఈస్ట్)లో ఏదేశం సైనిక బలం ఎంత ఉందో తెలుసుకుందాంఆ.
ఏదేశ ఆర్మీ బలం ఎంత?
మిడిల్ ఈస్ట్‌లోని దేశాల్లో టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనది. పవర్ ఇండకెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్‌లో 0.16971 స్కోరుతో టర్కీ మొదటి స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వాటిని వాడే నైపుణ్యం ఉన్న బలగాలు టర్కీ ఆర్మీలో ఉన్నాయి..
ఇరాన్..
ఇక పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ బలగాలు ఉన్నాయి. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.
ఈజిప్టు..
ఇక పది లక్షలకుపైగా బలగాలతో ఈజిప్టు మిటలరీ శక్తివంతంగా ఉంది. ఇండెక్స్ స్కోరు 0.22831. మిడిల్ ఈస్ట్‌లో ఈజిప్టు సైనిక శక్తిలో మూడోస్థానంలో ఉంది.
ఇజ్రాయెల్..
ఇక ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇండకెక్స్ స్కోరు 0.25961. మిడిల్ ఈస్ట్‌లో సైనిక శక్తిలో నాలుగో స్థానంలో ఉంది. మిలటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్‌కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులు అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇజ్రాయెల్ సొంతం.
సౌదీఅరేబియా..
బలమైన ఆర్థిక వనరులు, అతాయధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్ స్కోరు 0.32351గా ఉంది.
ఇరాక్..
పవర్ ఇండెక్స్‌లో ఇరాక్ ఆరోస్థానంలో ఉంది. ఈ దేశ ఇండెక్స్ స్కోరు 0.74411.
యూఏఈ..
సైనికులకు అత్యాధునిక విక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్సలో ఏడోస్థానంలో ఉంది. ఇండెక్స్ స్కోరు 0.80831గా ఉంది.
సిరియా..
సిరియా పవర్ ఇండకెక్స్‌లో 8వ స్థానంలో ఉంది. ఇండకెక్స్ స్కోరు. 1.00261 గా ఉంది.
ఖతార్..
ఖతార్ 1.07891 ఇండెక్సు స్కోరుతో 9వ స్థానంలో ఉంది. ఆధునిక డిఫెన్స్ బలం ఉంది.
’పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి..
ఒక దేశం మిలటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్‌ను కొలమానంగా వాడతారు. దేశాల సైఆ్యలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరు నిర్ణయిస్తారు. ఒక దేవం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య పదాతి దళం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచ పటంలో భద్రతాపరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలను పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణనలోకి తీసుకుంటారు.
స్కోరులో ట్విస్టు..
ఒక దేశం సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో వెయిటేజీ ఇస్తారు. ఒక దేశ ఆర్మీకి అన్ని హంగులూ కలిగి ఉన్న ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం ఉంటే.. ఆ దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండకెక్స్‌లో వెనుకబడుతుంది. ఇండెక్స్ స్కోరును అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించాలి. అయితే పవర్ ఇండకెక్సు స్కోరు విషయంలో చిన్న ట్విస్టు ఉంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే.. ఆదేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: War clouds in west asia which country knows the most power
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com