https://oktelugu.com/

Visakhapatnam: ఎన్నారైకు వలపు వల.. పెళ్లి చేసుకోవాలని బెదిరింపు.. ఇంట్లో బంధించి హత్యాయత్నం!

వలపు వల వేసే అమ్మాయిలు ఇటీవల పెరుగుతున్నారు. డబ్బు ఉన్నవారిని ఎంచుకుని కొందరు, దేశ రహస్యాలు తెలుసుకునేందుకు కొందరు వలపు వలతో గాలం వేస్తున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 6, 2024 4:07 pm
    Visakhapatnam

    Visakhapatnam

    Follow us on

    Visakhapatnam: తమకు అవసరమైన డబ్బుల కోసం, తమకు అవసరమైన సమాచారం కోసం సీక్రెట్‌ ఏజెంట్లు వలపు వల ద్వారా సాధిస్తారు. కానీ, ఈ రోజుల్లో తమ అవసరాల కోసం యువతులు వలపు వలతో మగాళ్లను లొంగదీసుకుంటున్నారు. తమకు కావాల్సింది రాబట్టుకుంటున్నారు. తాజాగా విశాఖపట్టణానికి చెందిన ఓ యువతి ఏకంగా ఎన్నారైకే వలపు వల వేసింది. పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. చివరకు ఇంట్లో బంధించి హత్య చేయడానికి కూడా యత్నించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోని షీలా నగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతగాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్‌ ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన కొరుప్రోలు జయా జమీమా పరిచయం పెంచుకుంది. అతడి అడ్రస్‌ తెలుసుకుంది. యువకుడి స్నేహితురాలిగా అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి మంచిదానిలా నటించింది. పెళ్లి చేసుకుంటానని అడిగింది. దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

    యువకుడిని విశాఖకు రప్పింది..
    తర్వాత యువకుడికి ఫోన్‌ చేసి అమెరికా నుంచి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టుకు రాగానే మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్స్‌ ఇచ్చి పెర్ఫ్యూమ్‌ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా క లిసినట్లు ఫొటోలు తీయించింది. వాటితో యువకుడిని బ్లాకెమెయిల్‌ చేసింది. దీంతో బెదిరిపోయిన యువకుడు తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అయినా వినిపించుకోకుండా జెమీమా తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేంది. ఇటీవల బీమిలిలోని ఓ హోటల్‌లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని యువకుడితో రూ.5 లక్షలు ఖర్చు చేయించింది. తర్వాత నిశ్చితార్థం, ఏకాంతంగా ఉన్న ఫొటోలు చూపించి మురళీనగర్‌లోని తన ఇంట్లో నిర్బాంధించింది. పెళ్లి చేసుకోకపోతే.. కేసు పెట్టి అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. డబ్బులు కాజేసింది.

    పారిపోయేందుకు యత్నించి..
    ఒక రోజు యువకుడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో సహచరులతో కలిసి కత్తితో బెదిరించి చంపడానికి యత్నించింది. జెమీమాను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామని ఆమె అనుచరులు కూడా బెదిరించారు. అక్టోబర్‌ 4న బాధితుడు తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జెమీమాతోపాటు ఆమె అనుచరులను అరెస్టు చేశారు. జెమీమా గతంలో కూడా తన స్నేహితులతో కలిసి ధనవంతులైన అబ్బాయిలను ట్రాప్‌ చేసి భారీగా డబ్బులు వసూలుచేసినట్లు పోలీసులు తెలిపారు.