Mangalavaram sentiments in Telugu: వారాలలో రెండవ రోజైన మంగళవారం కుజుడికి ఎంతో ప్రీతికరమైనది. మంగళవారానికి అధిపతి కుజుడు. సాధారణంగా కుజుడిని ప్రమాదాలకు కారకుడని చెబుతుంటారు. అలాంటి మంగళవారం రోజున ఎటువంటి శుభకార్యాలను జరపడానికి ఇష్టపడరు.మనం ఏదైనా కార్యం నిర్వహిస్తున్నప్పుడు మంచి రోజు, ముహూర్తం చూసి ఆ కార్యం విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటాము. అయితే మంగళవారం కొన్ని పనులను చేయటం వల్ల తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మంగళవారం చేయకూడని ఆ పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: శివుని విగ్రహం రూపంలో ఎందుకు పూజించరు?
సాధారణంగా మహిళలు తల స్నానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. అయితే ఆడవారు కానీ, మగవారి కానీ తల స్నానాలను మంగళవారం చేయకూడదు. అలా తలస్నానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా మంగళవారం కుజుడికి ఇష్టమైన రోజు కావడంతో ఎటువంటి పనులు చేయడాని ముందు ఆలోచించాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది.
కొందరు వ్యక్తులు మంగళవారం ఇతరుల నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. అలా తీసుకున్న డబ్బు అవసరానికి కాకుండా వృధాగా ఖర్చు అవుతుంది.అందుకే మంగళవారం ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు, ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అంతేకాకుండా మంగళవారం జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు.
Also Read: శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలి!
మంగళవారం ఆంజనేయ స్వామిని ఎరుపురంగు పుష్పాలతో, ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కానీ కుజదోషం ఉన్నవారు ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే మహిళలు ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం