https://oktelugu.com/

Nandamuri Balakrishna: ఎన్టీఆర్, బన్నీ తర్వాత బాలయ్యతోనే.. ?

Nandamuri Balakrishna:  నటసింహం నందమూరి బాలకృష్ణతో క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని.. ఇప్పటికే కొరటాల, బాలయ్య కోసం కథ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. ఎంతైనా హీరోల ఇమేజ్‌లను బట్టి కథలు రాయడంలో కొరటాల శివకి మంచి అనుభవం ఉంది. మరి బాలయ్య కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి. ఏది […]

Written By:
  • Shiva
  • , Updated On : January 25, 2022 / 10:30 AM IST
    Follow us on

    Nandamuri Balakrishna:  నటసింహం నందమూరి బాలకృష్ణతో క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని.. ఇప్పటికే కొరటాల, బాలయ్య కోసం కథ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. ఎంతైనా హీరోల ఇమేజ్‌లను బట్టి కథలు రాయడంలో కొరటాల శివకి మంచి అనుభవం ఉంది. మరి బాలయ్య కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.

    Nandamuri Balakrishna

    ఏది ఏమైనా బాలయ్య బాబుకి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. కెరీర్ లో ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే బాలయ్యకి క్రేజ్ మాత్రం తగ్గదు. అయితే, ఒక్కోసారి ప్లాప్ ల వలయంలో పడి, అదే పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో మాత్రం కొంతవరకు మార్కెట్ ను కోల్పోతాడు. ఐతే, మళ్ళీ ఒక్క సూపర్ హిట్ ఇచ్చాడంటే.. ఇక అన్నీ పటాపంచలు కావాల్సిందే. వరుసగా డిజాస్టర్ల తర్వాత కూడా ఒకే ఒక్క సింగిల్ హిట్ చాలు. బాలయ్య రేంజ్ పెరగడానికి.

    Also Read:  వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ బేబీ బంప్ !

    అవును, నిజమే.. మళ్ళీ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి బాలయ్యకి ఒక్క సినిమా చాలు. అలాంటి సినిమానే పడింది అఖండతో. ఇదేదో మాట వరసకు చెబుతున్న ముచ్చట కాదు. వాస్తవంగా చెబుతున్న వ్యవహారమే. బాలయ్య బాబు విషయానికే వద్దాం. బాలయ్య – బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన సినిమా ‘అఖండ’ అద్భుతంగా హిట్ అయింది. మరి కొరటాల – బాలయ్య కలయికలో ఏ రేంజ్ సినిమా వస్తోందో చూడాలి.

    Balakrishna Koratala Siva

    నిజానికి కొర‌టాల శివ‌ రచయితగా ఉన్న సమయలోనే బాలయ్యకి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఇంకా సినిమాగా తీయలేదు. ప్రస్తుతం కొరటాల ఆ కథను బాలయ్యతోనే చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అయితేనే ఆ కథకు న్యాయం జరుగుతుందని కొరటాల ఫీలింగ్. పైగా ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని కొర‌టాల శివ‌ ఇప్పటికే ఓ టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి.. ఎన్టీఆర్, బన్నీ తో చేయబోయే సినిమా అనంతరం.. బాలయ్యతో సినిమా చేస్తాడట.

    ఎలాగూ బాల‌య్య మాత్ర‌మే చేయ‌ద‌గిన క‌థ‌ కాబట్టి.. బాలయ్య కూడా ఈ మధ్య ఫుల్ ట్రెండ్ లోకి వచ్చాడు కాబట్టి.. బాలయ్య పై ఉన్న నెగిటివ్ ఇమేజ్ ఈ మధ్య తొలిగిపోతుంది కాబట్టి.. మొత్తానికి కొర‌టాల, బాలయ్య తో ముందుకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

    Also Read: నేతాజీ పోరాటానికి యావదాస్తిని త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇదీ

    Tags