Breakfast: ప్రతి ఒక్కరు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేయడం పరిపాటే. ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని సార్లు టిఫిన్ మానేస్తుంటారు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరం శక్తిని పెంచుకోవాలంటే ఏదో ఒక ఆహారం తీసుకోవడం సహజం. అల్పాహారం విషయంలో అజాగ్రత్త అవసరం లేదు. సాధ్యమైనంత వరకు అల్పాహారం సరైన సమయానికి తీసుకోవడమే మంచిది.
ఉదయం అల్పాహారం మానేస్తే మధ్యాహ్నం భోజనం అతిగా తినే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అల్పాహారం మానేయడం వల్ల మనకు ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే టిఫిన్ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది.
సూక్ష్మపోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. అల్పాహారం తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అలాగే మనకు కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది. ధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్స్ కు దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో అల్పాహారం మనం మానేయడం వల్ల ఎన్నో సమస్యలకు మూలం అవుతుంది.
ఉదయం సమయంలో మనం కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. లేదంటే మన శరీర అవయవాలు బలహీనంగా మారతాయి. ఆకలి మందగిస్తుంది. ఫలితంగా ఎసిడిటి సమస్య ఏర్పడొచ్చు. ఈ క్రమంలో బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అల్పాహారం మానేస్తే ఇతర సమస్యలు రావడం సహజం. అందుకే మనం బ్రేక్ ఫాస్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.