https://oktelugu.com/

Smoking: సడెన్‌గా ధూమపానం మానేస్తే ఏమవుతుందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు

స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే స్మోకింగ్ చేయడం మానేసిన తర్వాత ఆరోగ్యం మెరుగుపడుందా? లేదా? అని చాలామంది సందేహిస్తారు. ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తప్పకుండా నయం అవుతుందని వైద్యులు కచ్చితంగా చెబుతున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2024 / 07:05 PM IST

    Smoking

    Follow us on

    Smoking: ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ విషయాన్ని థియేటర్లలో సినిమా వేసే ముందు చెబుతారు. అలాగే ధూమపానం బాక్స్ మీద కూడా రాసి ఉంటుంది. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది వీటిని తాగుతుంటారు. సిగరెట్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో.. శరీరంలో జరిగే మార్పులేంటో అందరికీ తెలిసిందే. కానీ సడెన్‌గా మీరు సిగరెట్ తాగడం మానేస్తే.. మీ శరీర అవయవాల్లో బోలెడన్నీ మార్పులు జరుగుతాయి. ఆ మార్పులేంటో ఈరోజు తెలుసుకుందాం.

    స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే స్మోకింగ్ చేయడం మానేసిన తర్వాత ఆరోగ్యం మెరుగుపడుందా? లేదా? అని చాలామంది సందేహిస్తారు. ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తప్పకుండా నయం అవుతుందని వైద్యులు కచ్చితంగా చెబుతున్నారు. సిగరెట్ మానేస్తే మెదడు పనితీరు మెరుగుపడి, మానసిక స్థితి మారుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన తగ్గి, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీర అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ఎక్కువగా సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల కణజాలం నాశనం అవుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థు నాశనం చేస్తుంది. అదే స్మోకింగ్ చేయకపోతే శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. సిగరెట్ ఎప్పుడు మానేసినా.. మీ ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి. ధూమపానం వల్ల గతంలో జరిగిన నష్టాలని కూడా రికవరీ చేయవచ్చు. అయితే మొత్తం రికవరీ చేయడమనేది కష్టం. సిగరెట్ తాగడం మానేసిన తర్వాత సగం రికవరీకి దాదాపు 20 నుంచి 30 ఏళ్లు పడుతుందట. కాబట్టి సిగరెట్ తాగవద్దు. ఇది మీ ఆరోగ్యమే కాకుండా కుటుంబం, పుట్టే మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తుంది.

    సిగరెట్ మానేసిన 20 నిమిషాల తర్వాత బీపీ, పల్స్ రేటు సాధారణ స్థితికి చేరుకుంటాయి. 4 గంటల తర్వాత సిగరెట్ వాసన పోతుంది. ఇకపై సిగరెట్ వాసన రాదు. అయితే మానేసిన 4 గంటల తర్వాత కాస్త చిరాకుకు గురవుతారు. 24 గంటల తర్వాత రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ స్థాయి తగ్గిపోతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు బాగా మెరుగుపడతాయి. సిగరెట్ మానేసిన 7 రోజుల తర్వాత శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా అందుతాయి. అలాగే విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది. రుచి, వాసన శక్తి బాగా పనిచేస్తుంది. రెండు వారాల తర్వాత శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రక్త సరఫరాతో పాటు ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఒక నెల తర్వాత నికోటిన్ దుష్ప్రభావాలు తగ్గుతాయి. మూడు నెలల తర్వాత ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అందులో ఉండిపోయిన సిగరెట్లలోని టార్‌తో పాటు దుమ్ము, శ్లేష్మాం కూడా తొలగిపోతుంది. ఆరు నెలల తర్వాత సిగరెట్ల వల్ల వచ్చే దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. ఏడాదికి గుండెపోటు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గిపోతుంది. పదేళ్ల తర్వాత లంగ్ క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్ట ఎట్టి పరిస్థితులోనైనా సిగరెట్‌కు దూరంగా ఉండండి.