Tomato: భారతదేశంలో రాష్ట్రం ఏదైనా సరే కానీ ఒక కూరగాయ మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదేనండి టమాట. ఏ రాష్ర ప్రజలు అయినా సరే టమాటను కచ్చితంగా వారి వంటల్లో ఉపయోగిస్తుంటారు. చాలా వంటల్లో ఇది మెయిన్ గా రాజ్యమేలుతుంది. వంటలకు ప్రత్యేక రుచిని అందిచడమే కాదు.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది టమాట. ఈ కూరగాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. మరి ఈ టమాటలను రోజు తీసుకుంటున్నారు. కానీ వీటివల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలిస్తే మరింత ఎక్కువే తింటారు. మరి అవేంటో కూడా ఓసారి చూసేయండి.
రోగనిరోధకశక్తి : ఎన్నో వ్యాధుల నుంచి పోరాడాలి అంటే రోగనిరోధక శక్తి బాగుండాలి. టమాటాల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి.. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విటమిన్ సి తో పాటు టమాట యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయం చేస్తుంది. ఫోలేట్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా టమాటాలో ఉంటాయి.
గుండె ఆరోగ్యం : గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ లు టమాటలో ఎక్కువ ఉంటాయి. ఇందులో ఉండే లైకోపీన్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ టమాటల వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.. బీపీ లెవల్స్ నార్మల్‌గా ఉండాలంటే పొటాషియం ఉండాలి. ఇక ఈ పొటాషియం టమాటలో సమృద్దిగా ఉంటుంది. కాబట్టి మీకు బీపీ సమస్య కూడా తక్కువే.
క్యాన్సర్ నివారణ : టామాటలోని లైకోపీన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది కాబట్టి ఈ లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలను నియంత్రించి క్యాన్సర్ ను రాకుండా చేస్తుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, పొట్ట క్యాన్సర్ల రిస్క్‌ను లేకుండా చేస్తుంది టమాట. టమాటలో లభించే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్స్ కూడా క్యాన్సర్ ను నియంత్రిస్తాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి క్యాన్సర్లపై పోరాడుతుంటాయి.
స్కిన్ కేర్: బీటా-కెరోటిన్, లుటిన్, లైకోపీన్ వంటివి ఈ ఎర్ర టమాటల్లో ఎక్కువ. ఇవి UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడి మెరిసేలా చేస్తాయి.సన్ బర్నింగ్ నుంచి కూడా కాపాడుతాయి. ఇక తినడం వల్ల మాత్రమే కాదు దీన్ని బయట నుంచి కూడా ఉపయోగించవచ్చు. టమాటను చర్మంపై రుద్దడం వల్ల మీ చర్మం మెరుస్తుంది అంటున్నారు నిపుణులు.
అంతే కాదు బాగా పండిన టమాటాలను ఉదయం పూట నీళ్లు తాగకుండా ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. రికెట్స్‌తో బాధపడుతున్న పిల్లలకు కూడా ప్రతి రోజూ ఒక గ్లాసు టమాటా రసం ఇవ్వడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు కూడా టమాట వల్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి మెరుగుపడుతుందట. బరువు తగ్గడానికి కూడా ఈ టమాటాలు తినవచ్చు. మీరు టమాటాను సలాడ్‌లో కూడా చేర్చుకోవచ్చు. లేదంటే 1-2 గ్లాసుల టమాటా రసం చేసుకున్నా సరిపోతుంది.