https://oktelugu.com/

ప్రెగ్నెన్సీ టైంలో నెయ్యి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా మహిళలు తినే ఆహారానికి, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత తినే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన మహిళలు వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ డైట్ లో మార్పులు చేసుకోవాలి. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన మహిళలు నెయ్యి తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొందరు తింటే ఈజీ డెలివరీ అవుతుందని చెబితే మరికొందరు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. పెద్దవాళ్లు ఎక్కువగా ప్రెగ్నెన్సీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 27, 2020 / 07:40 AM IST
    Follow us on


    సాధారణంగా మహిళలు తినే ఆహారానికి, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత తినే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన మహిళలు వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ డైట్ లో మార్పులు చేసుకోవాలి. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన మహిళలు నెయ్యి తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొందరు తింటే ఈజీ డెలివరీ అవుతుందని చెబితే మరికొందరు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు.

    పెద్దవాళ్లు ఎక్కువగా ప్రెగ్నెన్సీ సమయంలో నెయ్యి తీసుకోవాలని అలా చేసే ఈజీ డెలివరీ అవుతుందని తెలుపుతూ ఉంటారు. అయితే శాస్త్రీయంగా దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే నెయ్యి తీసుకోవడం మంచిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయి. నెయ్యి గర్భంలోని శిశువుకు సరైన ఆరోగ్య ప్రయోజనాలు అందేలా చేస్తుంది.

    నెయ్యిలో విటమిన్స్, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది మార్కెట్ లో నెయ్యిని కొనుగోలు చేసి ఆ నెయ్యినే వాడుతూ ఉంటారు. అయితే ఆ నెయ్యి కంటే ఇంట్లో తయారు చేసుకునే నెయ్యిని వాడటం శ్రేయస్కరం. అయితే నెయ్యిని వాడే విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అయితే నెయ్యిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎకువ మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

    అన్నం, రోటీ, పరాటా, పాయసం, లడ్డూల ద్వారా నెయ్యిని తీసుకోవచ్చు. ఎక్కువగా నెయ్యి తీసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గుతాయని, కొందరు మహిళలు ఒబెసిటీ బారిన పడే అవకాశాలు ఉన్నాయని, డెలివరీ తరువాత బరువు తగ్గడం కష్టమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.