రూపే కార్డు వాడేవాళ్లకు శుభవార్త.. 65 శాతం డిస్కౌంట్!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివిధ బ్రాండ్ల ఉత్పత్తులపై 10 నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. రూపే కార్డు వినియోగదారులకు ఎన్పీసీఐ “రూపే ఫెస్టివ్ కార్నివాల్” పేరుతో ఈ కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది హెల్త్, ఫిట్‌నెస్, ఎడ్యుకేషన్, ఫార్మసీ, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఫార్మసీ రంగాల్లో రూపే కార్డును వినియోగించుకుని ఈ ప్రయోజనాలను పొందవచ్చు. సేఫ్, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్ పేమెంట్లను ప్రోత్సహించాలనే […]

Written By: Navya, Updated On : October 27, 2020 8:48 am
Follow us on


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివిధ బ్రాండ్ల ఉత్పత్తులపై 10 నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. రూపే కార్డు వినియోగదారులకు ఎన్పీసీఐ “రూపే ఫెస్టివ్ కార్నివాల్” పేరుతో ఈ కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది హెల్త్, ఫిట్‌నెస్, ఎడ్యుకేషన్, ఫార్మసీ, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఫార్మసీ రంగాల్లో రూపే కార్డును వినియోగించుకుని ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

సేఫ్, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్ పేమెంట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్పీసీఐ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్, స్విగ్గీ లాంటి ఈ కామర్స్ సంస్థల ఉత్పత్తులను కొనుగోలు చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ఈ సంస్థలతో పాటు శాంసంగ్ లాంటి బ్రాండ్లను కొనుగోలు చేసినా డిస్కౌంట్లు వర్తిస్తాయి. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో కస్టమర్లకు ఈ ఆఫర్ల ద్వారా ప్రయోజనం కలగనుంది.

ఎన్‌పీసీఐ మార్కెటింగ్ విభాగం చీఫ్ కునాల్ కలవాటియా మాట్లాడుతూ పండగ సమయంలో తమ వినియోగదారులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలను పొందడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని… తాజా నిర్ణయం వల్ల కస్టమర్లు డిజిటల్, కాంటాక్ట్ లెస్ లావాదేవీల పట్ల ఆకర్షితులవుతారని భావిస్తున్నామని తెలిపారు. రూపే కార్డులు మన దేశంలో మాత్రమే అంగీకరించబడతాయి.

రూపే కార్డులు భారతీయ సంస్థ ద్వారా జారీ చేయబడిన కార్డులు. దేశంలోని ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సరస్వత్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & మహారాష్ట్ర కో అప్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూపే కార్డులను జారీ చేస్తాయి.