Health Tips : రాత్రి సమయంలో పెరుగు తినవచ్చా? తింటే ఏం జరుగుతుందో తెలుసా?

అయితే పెరుగు మనం తీసుకునే పద్దతిలో తీసుకుంటే శరీరానికి సర్వ రోగనివారణిలా పని చేస్తుందట. చాలా మంది పెరుగు మార్నింగ్ తోడు వేసుకొని సాయంత్రం తింటుంటారు. సాయంత్రం తోడు వేసుకొని ఉదయం తింటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే మార్నింగ్ తోడు వేసుకుని సాయంత్రం తినే పెరుగు చాలా మంచిదట

Written By: Swathi, Updated On : July 21, 2024 2:36 pm
Follow us on

Health Tips : దేవతలకు అమృతం ఎలాగో మానవులకు పెరుగు అంతే అంటారు పెద్దలు. అంటే పెరుగుకు అంత శక్తి ఉందని నమ్ముతారు కొందరు. అయితే కొందరికి ముక్కలేనిదే ముద్ద ఎలా దిగదో ..అలాగే చివరికి పెరుగు అన్నం ఒక ముద్ద అయినా తినాల్సిందే మరికొందరు. లేదంటే అన్నం తిన్న ఫీల్ కూడా రాదట. కానీ రాత్రి సమయంలో పెరుగు తినవద్దు అంటారు. ఇంతకీ పెరుగు రాత్రి సమయంలో తినవచ్చా లేదా? తింటే ఏం జరుగుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రీడ్ ది స్టోరీ.

అయితే పెరుగు మనం తీసుకునే పద్దతిలో తీసుకుంటే శరీరానికి సర్వ రోగనివారణిలా పని చేస్తుందట. చాలా మంది పెరుగు మార్నింగ్ తోడు వేసుకొని సాయంత్రం తింటుంటారు. సాయంత్రం తోడు వేసుకొని ఉదయం తింటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే మార్నింగ్ తోడు వేసుకుని సాయంత్రం తినే పెరుగు చాలా మంచిదట. ఈ పెరుగు కొంచెం పులుస్తుంది. పులుచిన పెరుగులో ఉండే మంచి బ్యాక్టీ రియాలు జీర్ణవ్వవస్థకు సహాయం చేస్తాయట. ఇది గ్యాస్, కడుపులో మంట వంటి సమస్య అధిగమించి జిర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు.

అలాగే మలబద్ధకం, చర్మ సౌందర్యానికి, వెంట్రుకలు రాలిపోకుండా ఉండే సమస్యల నుంచి కూడా పెరుగు తినడం వలన ప్రయోజనాలు ఉంటాయి. మోతాదులో తిసుకునే పెరుగుతో డయేరియాను అరికట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. పెరుగు ఎముకలు, దంతాలను, బలంగా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. పెరుగు లో విటమిన్ “డి “, ప్రోటీన్స్ లు, కాల్షియం, పోషకాలు ఉంటాయి. అయితే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి.

అయితే పెరుగు నైట్ తినవద్దని డాక్టర్ కూడా చెబుతుంటారు. కాని తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. కానీ పెరుగును పలుచగా మజ్జిగ చేసుకొని తినాలి. నైట్ బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. పెరుగు కూడా చలువ చేస్తుంది. కావున పెరుగులాగ తినడ కంటే మజ్జిగ బెటర్ అంటున్నారు నిపుణులు. పెరుగును వేరువేరు వంటకాలలో చాలా కొత్త కొత్త వేరేటిల కోసం, రుచి కోసం చాలా ఐటమ్స్ లో మిక్స్ చేస్తారు. ఇలా చేయడం పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వలన పెరుగు కల్తీ అవుతుందట. వాటిలో లభించే విటమిన్స్ ప్రోటీన్స్ కోల్పోతాము. కాబట్టి పెరుగును పెరుగులాగా తిని, మితంగా తీసుకోండి. శరీరానికి ఎలాంటి పదార్థం అయినా సరిపడా తింటే అమృతం ఎక్కువైతే విషం.

రాత్రిపూట పెరుగు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉందట. అంతేకాదు ఈ సమయంలో పెరుగు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందట. అందుకే అధిక బరువుతో బాధపడుతున్నవారు పెరుగును స్కిప్ చేయాలి అని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వీలైతే, మజ్జిగ తాగాలి అని సలహా ఇస్తున్నారు. అంతేకాదు శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నా కూడా పెరుగుకు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు.

జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు, అలర్జీ ఉన్న వారు రాత్రి పూట పూర్తిగా పెరుగు స్కిప్ చేయడం బెటర్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. ఎందుకంటే.. పెరుగు కఫంకి కారణం అవుతుంది.. అందుకే రాత్రి సమయంలో పెరుగు తీసుకోకపోవడం మానేయాలి. ఇక జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట పెరుగు జోలికి వెళ్లకూడదు. అలాగే తరచుగా అసిడిటీ, అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నా కూడా పెరుగుకు దూరంగా ఉండాలి. ఇక జీర్ణక్రియ నెమ్మదిగా ఉన్నా సరే పెరుగు మానేయాలి అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు తినవద్దని సూచిస్తున్నారు.