Health News : నాలుక వల్ల వ్యాధులను గుర్తించవచ్చా? నాలుక శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

నాలుక శుభ్రంగా లేకుంటే నోటి పరిశుభ్రతను మాత్రమే కాదు ఇతర వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. మరి నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి అనుకుంటున్నారా? నాలుక అనారోగ్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By: Swathi, Updated On : July 21, 2024 2:50 pm
Follow us on

Health News :  ఉదయం లేవాలి. లేచిన తర్వాత వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. బ్రష్, స్నానం వంటివి ప్రతి రోజు చేయాల్సిందే. మరి బ్రష్ చేయడం అంటే ఓ రెండు సార్లు బ్రెష్ ను వేసి అటు ఇటు తిప్పడం మాత్రమే కాదు కదా. ఇంతకీ బ్రష్ చేయడంతో పాటు నాలుకను కూడా క్లీన్ చేస్తున్నారా లేదా అనేది కూడా మెయిన్ అంటున్నారు నిపుణులు. నోటి పరిశుభ్రత కోసం మీ పళ్లను మాత్రమే బ్రష్ చేసుకోవడం కాదు. మీ నాలుకను కూడా కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. దంతాలను రోజు శుభ్రం చేసినట్టుగానే నోటిలో అతి ముఖ్యమైన భాగమైన నాలుకను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

రెండుసార్లు పళ్లు తోముకుని మేము బాగా బ్రష్ చేసుకున్నాం అనుకోవద్దు. మీరు బ్రష్ చేసుకోవడం ఎంత ముఖ్యమో..నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. లేదంటే ఎలాంటి ఫలితం ఉండదు. మౌత్ క్లీనింగ్ లో కేవలం దంతాల శుభ్రతను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా.. నాలుకను దంతాలతో పాటూ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీ మౌత్ మొత్తం క్లీన్ అవుతుంది అంటున్నారు నిపుణులు.

నాలుక శుభ్రంగా లేకుంటే నోటి పరిశుభ్రతను మాత్రమే కాదు ఇతర వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. మరి నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి అనుకుంటున్నారా? నాలుక అనారోగ్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నాలుక శుభ్రంగా, ఆరోగ్యంగా లేనప్పుడు మనకు కొన్ని సంకేతాలు వస్తుంటాయి. వాటిని బట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నాలుక ఎలాంటి సంకేతాలను పంపిస్తుంది అని క్రిటికల్ గా ఆలోచించాల్సిన అవసరం లేదట. కేవలం నాలుకను చూసి శుభ్రంగా ఉందా? లేదా అని అంచనా వేయవచ్చట. నోట్లో బొబ్బలు ఏర్పడి నాలుక తెల్లగా లేదా రంగు మారితే మీ నాలుక శుభ్రంగా లేనట్టు. కొందరి నాలుక మరీ మెత్తగా ఉంటుంటే.. అంటే వారికి పోషకాహార లోపం ఉండదన్నట్టు.

నాలుక మీద పగుళ్లు ఉంటే నాలుక అపరిశుభ్రంగా ఉందని సంకేతం. నాలుక ఆరోగ్యం, వ్యాధుల ప్రభావం రెండూ కూడా ఒకదానితో ఒకటి ముడివేసుకొని ఉంటాయి . జీర్ణక్రియ సరిగా లేనప్పుడు నాలుక నలుపు లేదా తెలుపు రంగులో లోకి మారుతుందట. నోటి నుంచి దుర్వాసన వచ్చినా కూడా నాలుక సరిగ్గా శుభ్రం చేయట్లేదు అనుకోవాలి. కొన్ని సార్లు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా నాలుక ఆరోగ్యంగా ఉండదని సంకేతం. అంతేకాదు డయాబెటిస్ అదుపులో లేకపతే నాలుక అనారోగ్యంగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు.

మరి ఇన్ని వ్యాధులను సూచించే నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. రోజూ నాలుకను శుభ్రపరచడానికి సులభమైన, సురక్షితమైన మార్గం టంగ్ క్లీనర్ ఉపయోగించడం. దీని వల్ల నోటి అపరిశుభ్రత నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ప్లాస్టిక్ నుంచి స్టీల్ దాకా రకరకాల టంగ్ క్లీనర్లు లభిస్తున్నాయి. కానీ రాగితో చేసిన కాపర్ టంగ్ క్లీనర్లు వాడటం వల్ల నాలుక చాలా బాగా శుభ్రపడుతుంది. అంతేకాదు రాగి టంగ్ క్లీనర్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

బ్రష్ చేసుకున్న తర్వాత కనీసం రెండు సార్లు అయినా నాలుకను శుభ్రం చేసుకోవాలి. తద్వారా నాలుకపై ఉన్న మురికి పోతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే మీరు మంచి ఫలితాలను పొందుతారు. పసుపు, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేసి నాలుకపై పది నిమిషాల అప్లే చేసి వదిలేయండి. పది నిమిషాల తర్వాత నాలుకను శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల నాలుకపై పేరుకుపోయిన మురికి శుభ్రపడుతుంది.