Calcium Rich Foods: ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. శరీరంలో కాల్షియం ఎక్కువగా లేకపోవడం మోకాళ్ల నొప్పులకు కారణమవుతోందని తెలుస్తోంది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పుల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు పాలు తాగడం ద్వారా శరీరానికి 276 ఎంజి కాల్షియం పొందవచ్చు.
పాలతో చేసిన పదార్థాల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఆరెంజ్, కమలా పండ్లను తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆరెంజ్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. నారింజ పండ్ల ద్వారా 72.2 మిల్లీ గ్రాముల క్యాల్షియంను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!
శరీరానికి డ్రై ఫ్రూట్స్ ద్వారా కూడా చాలా మేలు జరుగుతుందనే సంగతి తెలిసిందే. వైద్యులు డ్రై ఫ్రూట్స్ ను తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో క్యాల్షియం ఎక్కువమొత్తంలో ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి. క్యాబేజీ. సోయాబీన్స్, క్యారెట్ ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా పొందే ఛాన్స్ ఉంటుంది.
పప్పు ధాన్యాలు, బీన్స్ ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. చిక్కుళ్లు తినడం ద్వారా క్యాల్షియంతో పాటు ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ ప్రోటీన్, ఐరన్, జింక్, పొటాషియం లభిస్తాయి. ప్రతిరోజూ ఆకుపచ్చని కూరగాయలు తినడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన కాల్షియం, ఇనుము లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతిరోజూ కాల్షియంతో ఉండే ఆహారాలు తీసుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
Also Read: ఉక్రెయిన్ విషయంలో చైనా ఎందుకు వెనకడుగు వేస్తోంది?
Recommended Video: