Lucky Bhaskar on OTT : 2024 దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్, అమరన్, క పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ మూడు చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఆయన భార్య పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించింది. లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.
దుల్కర్ సల్మాన్ కి తెలుగులో వరుసగా మూడో హిట్ లక్కీ భాస్కర్. మహానటి, సీతారామం తాజాగా లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. 1980లలో జరిగిన పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ మూవీ బడ్జెట్ రూ. 30 కోట్లు అని సమాచారం. వరల్డ్ వైడ్ లక్కీ భాస్కర్ రూ. 111 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగుతో పాటు మలయాళం ఇతర భాషల్లో విడుదల చేశారు. నిర్మాతలకు పెద్ద మొత్తంలో లక్కీ భాస్కర్ లాభాలు తెచ్చిపెట్టింది.
అనంతరం విడుదలైన కంగువా, మట్కా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం లక్కీ భాస్కర్ కి ప్లస్ అయ్యింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో లక్కీ భాస్కర్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. కాగా లక్కీ భాస్కర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుందట. లక్కీ భాస్కర్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఒప్పందం ప్రకారం మూవీ విడువులైన నాలుగు వారాలకు అనగా నవంబర్ 30 నుండి అందుబాటులోకి రానుందట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఓ పేద బ్యాంకు ఉద్యోగి కథ లక్కీ భాస్కర్. కుటుంబం కోసం ఏదైనా చేసే భాస్కర్… ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు అడ్డదారి వెతుక్కుంటాడు. బ్యాంకు ఉంద్యోగిగా తనకు ఉన్న జ్ఞానం ఉపయోగించి అక్రమంగా డబ్బులు ఆర్జిస్తాడు. దాని వలన అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటీ? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? అనేది లక్కీ భాస్కర్ స్టోరీ..