Corona : కరోనా ప్రభావం మనుషుల మీద గణనీయంగానే పడింది. అప్పటి నుంచి కరోనా బారిన పడిన వారికి వాసన రావడం లేదు. ముక్కులో వాసనను పసిగట్టే నాడీ కణాల మీద ప్రభావం పడటంతో నాడీ కణాల సంఖ్య పడిపోయింది. ఫలితంగా ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతోంది. ఓ అధ్యయనంలో ఈ విషయం కనుగొన్నారు. కొవిడ్ 19 కారక వైరస్ దాడి చేయడం వల్ల ముక్కు వాసన పసిగట్టే భాగం తీవ్రంగా దెబ్బ తిన్నట్లు గుర్తిస్తున్నారు. దీని ప్రభావంతో వాసన చూసే శక్తిని కోల్పోవడం జరుగుతోంది.
వాసన ఎందుకు కోల్పోతాం
కరోనా వైరస్ సోకిన వారికి మొదటి లక్షణం వాసన కోల్పోవడం, తరువాత దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా పరీక్ష చేయించుకునే వారు. కరోనా గాలి ద్వారా సోకే వ్యాధి కావడంతో అది మొదట మన ముక్కు మీదే ప్రభావం చూపిస్తోంది. అందుకే మనం వాసన కోల్పోవడం జరుగుతుంది. ఇలా కరోనా కాలంలో అందరు ఎంతో భయపడిపోయారు. తరచు పరీక్షించుకున్నారు. ముక్కు పనిచేస్తోందా లేదా అని చూసుకున్నారు. ఇలా కరోనా మహమ్మారి మన జీవితాల మీద పెను ప్రభావమే చూపింది.
ఎందుకీ ప్రభావం
కరోనా కాలంలో వేలాది మంది దాని బారిన పడి నానా యాతన అనుభవించారు. క్వారంటైన్ లో ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. కరోనా ప్రభావంతో వృద్ధులైతే తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంత మంది కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాంటి వారిలో నరాల భాగంలో ఉండే కణజాలం దెబ్బతిని వాసన ప్రభావం పోయినట్లు గుర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా కొందరికి వాసన రావడం లేదంటే అతిశయోక్తి కాదు. కరోనా చూపిన పెను ప్రభావానికి అందరు బాధితులయ్యారు.
మళ్లీ రెక్కలు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మొదటి, రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా వేసుకున్నారు. అందుకే మన దేశంలో అంతలా ప్రభావం చూపడం లేదు. కానీ చైనాలో దాని తీవ్రత ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయం పట్టుకుంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటున్నా అది మనతోనే సహవాసం చేసేందుకు రెడీ కావడం అందరిలో ఆందోళనకు కారణమవుతోంది.