
Director Venu Remuneration: ఈమధ్య కాలం లో చిన్న సినిమా గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాలలో ఒకటి ‘బలగం’. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.తెలంగాణ సంప్రదాయం మొత్తం వెండితెర మీద ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ వేణు.కామెడీ స్కిట్స్ చేసే వేణు లో ఇంత టాలెంట్ దాగి ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ సినిమా.
కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు కమర్షియల్ గా కూడా చిన్న సినిమాలలో మినీ బాహుబలి రేంజ్ వసూళ్లను రాబట్టింది. కేవలం కోటి రూపాయిల లోపు బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇటీవలే ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకి డిజిటిల్ మీడియా ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా తీసినందుకు గాను వేణు కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో, ఆర్థికంగా కూడా అదే రేంజ్ లో లాభపడ్డాడని అంటున్నారు.ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు వేణు కి గిఫ్ట్ గా రేంజ్ రోవర్ కార్ ని ఇచ్చాడని తెలుస్తుంది.దాంతో పాటుగా అతనికి మూడు కోట్ల రూపాయిల వరకు పారితోషికం ఇచ్చాడని టాక్.ఇదే కనుక నిజమైతే వేణు కి పండగే అని చెప్పొచ్చు.ఈ సినిమా కి థియేటర్స్ నుండి దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది, ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు, రన్ అవుతూనే ఉంది.

ఈ థియేట్రికల్ షేర్ తో పాటుగా ఓటీటీ రైట్స్ నుండి దిల్ రాజు కి 30 కోట్ల రూపాయిలు వచ్చాయట.అంతే కాకుండా సాటిలైట్ రైట్స్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 20 కోట్ల రూపాయిల లాభం.ఆలా మొత్తం కలిపి 63 కోట్ల రూపాయిలు వచ్చాయి అన్నమాట.కోటి రూపాయిల లోపు బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సృష్టించిన ఈ అద్భుతం చూస్తూ ఉంటే ప్రస్తుతం స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్ ఎక్కువ అనే విషయం అర్థం అవుతుంది.