
Rajamouli- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు అయిపోయిన కూడా అభిమానులు వేడుకలు ఇంకా ఆపలేదు. థియేటర్స్ ‘ఆరెంజ్’ సినిమా రూపం లో సెలెబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు, పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఒక డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు ఎలా వస్తున్నాయి అని ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టిన సందర్భం ఇది. ఇది ఇలా ఉండగా చరణ్ పుట్టిన రోజు ని ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రత్యేకంగా తీసుకొని మొన్న రాత్రి బర్త్ డే బ్యాష్ ని నిర్వహించాడు.
ఈ పార్టీ సెలెబ్రేషన్స్ కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖలందరూ హాజరయ్యారు.దానికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ఈవెంట్ ఒక అతిథిగా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్ కి ఇచ్చిన గిఫ్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ గిఫ్ట్ ని రోజ్ వుడ్ చేయించిన యూనిక్ హ్యాండ్ మేడ్ లారీ ఆకారం తో ఉంటుందట, దీనిని రామ్ చరణ్ పుట్టిన రోజు కోసం రాజమౌళి ప్రత్యేకంగా చేయించాడట. అంతే కాదు అదే రోజ్ వుడ్ తో చేయించిన ఒక ప్రతిమ ని కూడా రాజమౌళి రామ్ చరణ్ కి గిఫ్ట్ గా ఇచ్చినట్టు సమాచారం.వీటి ధర కోటి రూపాయిల వరకు ఉంటుందట.

ఇక ఆస్కార్ అవార్డు గెలిచినందుకు గాను చిరంజీవి రాజమౌళి కి ప్రత్యేకంగా సన్మానం చేసాడు, ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. #RRR సక్సెస్ కారణంగా ఇంతకాలం అవార్డులు రివార్డులు అంటూ దేశం కానీ దేశం లో పయనించిన రాజమౌళి,ఇప్పుడు ఒక రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబొయ్యే షూటింగ్ ని ప్రారంభిస్తాడు.