https://oktelugu.com/

కొత్త బట్టలకు పసుపు రాయడం వెనుక గల కారణం తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో ఏదైనా పండుగలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వస్తే కొత్త బట్టలను వేసుకోవడం అనేది ఒక భాగం అయిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి శుభకార్యానికి కొత్త బట్టలను వేసుకుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే కొత్త బట్టలను చూడగానే వాటిని ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఎదురుచూస్తుంటారు. కానీ కొత్త బట్టలు మనం ధరించక ముందే వాటికి పసుపును రాస్తారు. ఈ విధంగా పసుపు రాయడం పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2020 / 12:09 PM IST
    Follow us on

    సాధారణంగా మన ఇంట్లో ఏదైనా పండుగలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వస్తే కొత్త బట్టలను వేసుకోవడం అనేది ఒక భాగం అయిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి శుభకార్యానికి కొత్త బట్టలను వేసుకుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే కొత్త బట్టలను చూడగానే వాటిని ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఎదురుచూస్తుంటారు. కానీ కొత్త బట్టలు మనం ధరించక ముందే వాటికి పసుపును రాస్తారు. ఈ విధంగా పసుపు రాయడం పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా వస్తుంది. అయితే కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

    మనం చేసేటువంటి ఎటువంటి పూజా కార్యక్రమాలలో లేదా పుణ్య కార్యాలలో మొదటి స్థానం పసుపుకి ఉంటుంది. అంతేకాకుండా పసుపుని ఒక మంగళప్రదంగా కూడా భావిస్తారు. ఈ విధంగా పసుపు కు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అయితే బట్టలు తయారయ్యేటప్పుడు ఎన్నో దశలలో వివిధ రూపాలలో తయారై కొత్త బట్టలు తయారవుతాయి. అంతేకాకుండా ఈ బట్టలు తయారు చేసే క్రమంలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు వాటి పై చేరి ఉంటాయి. ఫలితంగా ఆ బట్టలను ధరించడం వల్ల కొంత వరకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

    ఈ విధంగా ఆ సూక్ష్మ జీవులు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పూర్వకాలంలో కొత్తబట్టలకి కొద్దిగా పసుపు రాసేవారు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఆ క్రిములను నశింపజేస్తుంది. పసుపును సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం గా భావించడం వల్ల శుభకార్యాలలో వాడుతూ ఉంటాము. అయితే ఆ శుభకార్యాలలో వాడే దుస్తులకు మాత్రం పసుపు వాడ కూడదని పండితులు చెబుతున్నారు.