https://oktelugu.com/

జడ్జిలపై ఆ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఏపీలో అధికార పార్టీకి.. రాష్ట్ర హైకోర్టుకు మధ్య కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. జగన్‌ తెస్తున్న చట్టాలు.. తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు మోకాలడ్డుతోందని వైసీపీ నేతల ఆరోపణ. అందుకే.. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిదానిని వ్యతిరేకిస్తోందని చెబుతున్నారు. దీంతో జగన్‌ ఆ మధ్య సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ లేఖ రాశారు. ఆ లేఖ కూడా పెద్ద దుమారమే రేపింది. Also Read: పోలవరానికి కేంద్రం నుంచి వచ్చిందే కట్నమా? అయితే.. ఆ వేడి ఇంకా చల్లారకముందే […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2020 12:04 pm
    Follow us on

    MS Babu
    ఏపీలో అధికార పార్టీకి.. రాష్ట్ర హైకోర్టుకు మధ్య కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. జగన్‌ తెస్తున్న చట్టాలు.. తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు మోకాలడ్డుతోందని వైసీపీ నేతల ఆరోపణ. అందుకే.. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిదానిని వ్యతిరేకిస్తోందని చెబుతున్నారు. దీంతో జగన్‌ ఆ మధ్య సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ లేఖ రాశారు. ఆ లేఖ కూడా పెద్ద దుమారమే రేపింది.

    Also Read: పోలవరానికి కేంద్రం నుంచి వచ్చిందే కట్నమా?

    అయితే.. ఆ వేడి ఇంకా చల్లారకముందే వైసీపీకే చెందిన కీలక నేత ఒకరు న్యాయవ్యవస్థపై పిడుగుపాటు వ్యాఖ్యలు చేశారు. జడ్జిలపై జగన్ ఫిర్యాదు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ కావడం, జడ్జిలపై దూషణల కేసులో వైసీపీ నేతలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న దృష్ట్యా తాజా వ్యవహారం ఎక్కడివరకు దారితీస్తుందోననే ఉత్కంఠ రేపుతోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఆయన ముందు నుంచీ అనూహ్య రీతిలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

    ప్రచారంలో పెదవి విప్పకుండానే గెలుపొందిన ఆయన, అసెంబ్లీలో అర్థరహితంగా ప్రమాణస్వీకారం చేసి జాతీయ ఛానెళ్లకూ వార్త అయ్యారు. లాక్ డౌన్ సమయంలో సొంత పొలంలో వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలిచారు. అంతలోనే పూతలపట్టుకు చెందిన అమరజవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చినప్పుడూ అర్థంకాని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే.. వైసీపీకి న్యాయ వ్యవస్థకు మధ్య పితలాటకం కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

    Also Read: వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..!

    పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ.. ఇప్పుడు పదవుల్లో కొనసాగుతున్న వారు అసలు జడ్జిలేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులు అమ్మకానికి ఉన్నాయనే అర్థంలో.. ‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే అనుకూలంగా జడ్జిలు జడ్జిమెంట్లు ఇచ్చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. జడ్జిలుగా ఉంటూ అవినీతికి పాల్పడవచ్చా? అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా తీర్పులు చెబుతున్నారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. ఈ అవినీతి వ్యవహారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాత్ర కూడా ఉందని పేర్కొనడం గమనార్హం.

    చంద్రబాబు ఏది చెబితే ఏపీలోని కోర్టుల్లో అవే కీలకంగా, తీర్పులుగా మారుతున్నాయని ఆరోపించారు. ‘కొందరైనా జడ్జిలు పేద కుటుంబంలో పుట్టలేదా.. పేదల కష్టాలు మీకు తెలియవా?.. చంద్రబాబు చెప్పిందల్లా కీలకం అవుతున్నప్పుడు జడ్జిలు తమ పదవులకు మోసం చేసినట్లు కాదా?’ అని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. శనివారం పూతలపట్టులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్