Reading Books : ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో అందరూ మొబైల్స్‌తో సమయం గడిపేస్తున్నారు. కానీ గతంలో అయితే పుస్తకాలతో సమయం గడిపేవారు. ఏకదాటిగా మొబైల్స్ చూడటం వల్ల కళ్ల సమస్యలు, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. అదే పుస్తకం చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కొందరికి ఇంట్రెస్ట్ ఉండి చదవాలని అనుకున్న సరే.. ఒక ఐదు నిమిషాలకు మించి చదవలేరు. కొంతసేపు చదివి మళ్లీ మొబైల్ ఫోన్ పట్టుకుంటారు. వీటికి అంతలా బానిసలు అయిపోయారు. మొబైల్ ముసుగులో ఉండిపోయి అసలు ప్రపంచాన్ని కూడా మర్చిపోతున్నారు. ఏం చేసిన కూడా మొబైల్ చూస్తూనే చేస్తున్నారు. భోజనం, బయటకు వెళ్లినప్పుడు ఆఖరికి బాత్‌రూమ్ వెళ్లినప్పుడు కూడా మొబైల్ వాడుతున్నారు. వీటివల్ల లైఫ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. రోజూ ఒక పది నిమిషాలు అయిన పుస్తకాలు చదివితే మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. కానీ చదవడానికి ఆసక్తి లేకపోతే కొన్ని చిట్కాలు పాటించి పుస్తకాలు చదవండి.
నచ్చిన బుక్ సెలక్ట్ చేసుకోండి
పుస్తకాలు చదవాలని ఉంటుంది. కానీ చదవలేకపోతే.. మీకు నచ్చిన ఒక బుక్‌ను తీసుకోండి. బాగా నచ్చిన బుక్ తీసుకోవడం వల్ల ఇష్టం లేకపోయిన ఆ బుక్ చదువుతారు. విద్యార్థులు అయితే బాగా ఇంట్రెస్ట్ ఉండే సబ్జెట్ ముందు చదువుకోవాలి. దానివల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీంతో మిగతా సబ్జెట్‌లు చదవడానికి ఆటోమెటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తుంది.
తొందరగా కంప్లీట్ అయ్యే బుక్ స్టార్ట్ చేయాలి
ఎక్కువ పేజీలు ఉన్న బుక్స్ చదవడం వల్ల ఎంత చదివిన కూడా పూర్తి కాదు. దీంతో మీకు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి తక్కువ పేజీలు ఉండే బుక్‌ను తీసుకోవాలి. ఇవి అయితే తొందరగా కంప్లీట్ అయిపోతాయి. దీంతో మీకు చదివిన ఫీలింగ్ రావడంతో పాటు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది.
రోజుకి ఒక పది నిమిషాలు మాత్రమే కేటాయించండి
సడెన్‌గా పుస్తకాలు ఓపెన్ చేస్తే అసలు చదవలేరు. కాబట్టి రోజుకి పది నిమిషాలు లేదా కొంత సమయం మాత్రమే పెట్టుకోండి. ఇలా టైమ్ పెట్టుకుని రోజురోజుకి పెంచుకుంటూ పోవండి. దీంతో రోజూ మీకు చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రత్యేకంగా టైమ్ టేబుల్ ఏం వేయకుండా ఖాళీగా ఉండే సమయాల్లో, మొబైల్ ఫోన్ చూడకుండా బుక్ చదవడం, బయటు వెళ్లినప్పుడు బుక్ క్యారీ చేయడం వంటివి చేస్తుండాలి.
డైలీ ఇన్ని పేజీలు మాత్రమే చదవాలని ప్లాన్ చేసుకోవాలి
ఏదైనా బుక్ ఎక్కువ పేజీలు ఉందనుకోండి. రోజుకి ఇన్ని పేజీలు మాత్రమే చదివేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పుస్తకం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో మీకు తెలుస్తుంది. ఉదాహరణకు ఒక 100 పేజీలు బుక్ ఉందని అనుకోండి. రోజుకి మీ సమయం బట్టి 10 పేజీలు చదివే విధంగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు బుక్ కూడా తొందరగా అవుతుంది.
పుస్తకాల్లో ఉన్న మర్మం తెలుసుకోండి
ఏదో పుస్తకాలు చదవాలని కాకుండా అందులోని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల బుక్ చదవాలనే ఇంట్రెస్ట్ రోజురోజుకి పెరుగుతుంది.