Black Carrot Uses: మన దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరికే కూరగాయలలో బ్లాక్ క్యారెట్ కుడా ఒకటి. బ్లాక్ క్యారెట్ లో ఎక్కువగా ఉండే ఆంథోసైనిన్స్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొంచెం తీపిగా కొంచెం కారంగా ఉండే బ్లాక్ క్యారెట్ ను తినడానికి చాలామంది ఇష్టపడతారు. బ్లాక్ క్యారెట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అల్జీమర్స్, ఇతర ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. బ్లాక్ క్యారెట్ నరాల సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
అనేక మూలకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బ్లాక్ క్యారెట్ లో ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించడంలో బ్లాక్ క్యారెట్ సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బ్లాక్ క్యారెట్ తోడ్పడుతుంది. బీటా కెరాటిన్ సరఫరా విషయంలో బ్లాక్ క్యారెట్ ఉపయోగపడుతుంది. బీటా కెరాటిన్ వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుంది. మాక్యులర్ డీజెనరేషన్ ప్రమాదంను తగ్గించడంలో బ్లాక్ క్యారెట్ ఉపయోగపడుతుంది.
Also Read: చపాతీలు ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్!
కంటిశుక్లం అభివృద్ధిని తగ్గించడంలో బ్లాక్ క్యారెట్ ద్వారా మేలు జరుగుతోంది. బ్లాక్ క్యారెట్ లో ఉండే ఆంథోసైనిన్లు యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయి. శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించడానికి బ్లాక్ క్యారెట్ ఉపయోగపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడతాయి. బ్లాక్ క్యారెట్ కాన్సర్ కణాలను తటస్థం చేయడంలో ఉపయోగపడుతుంది.
బ్లాక్ క్యారెట్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, వికారం, మలబద్ధకం, అతిసారం సమస్యలను తగ్గించడంలో బ్లాక్ క్యారెట్ తోడ్పడుతుంది. “కంజి” పానీయం ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. బ్లాక్ క్యారెట్ ను తినడం అలవాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: సంక్రాంతికి సరికొత్తగా గాడిదల పందాలు