Rajesh Got 8 Government jobs
Warangal : ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లే కరువైన నేటి రోజుల్లో వచ్చిన నోటిఫికేషన్లకు లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ లక్షల మందిలో ఎంత కష్టపడినా ఒకటి, అర మార్కు తేడాతో ఉద్యోగాలు కోల్పోయినవారు వేల మంది ఉంటున్నారు. కొందరైతే ఇక మనకు జాబ్ రాదని చదవడం వదిలేస్తున్నారు. ఇలాంటి కాంపిటీషన్‌లో కొందరు మాత్రం ఒకటి, రెండు కాదు.. నాలుగైదు ఉద్యోగాలు సాధిస్తున్నారు. నిరంతర శ్రమతోపాటు పట్టుదల, కృషితో చాలా మంది ఒకటికన్నా ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం సాధించాలంటే చాలా వాటిని వదులు కోవాలి. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ అన్నీ పక్కన పెట్టాలి. 24 గంటలూ పుస్తకాలతో కుస్తీ పట్టాలి. ఒకసారి ఉద్యోగం వస్తే వదిలేసివాటికన్నా ఎక్కువ పొందొచ్చు. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అన్నీ వదులుకుని కష్టపడుతున్నవారు ఒకటికన్నా ఎక్కువ ఉద్యోగాలు సాధిస్తున్నారు.
8 జాబ్స్ కొట్టాడు..
వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయకుల రాజేశ్ అనే యువకుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఉద్యోగం కోసం చాలా మంది వేల రూపాయలు పోసి కోచింగ్‌లు తీసుకుంటారు. అయినా ఉద్యోగం రావడం అంత ఈజీ కాదు. కానీ రాజేశ్ ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. జాబ్ కొట్టాలన్న ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అన్నీ వదిలేశాడు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీ ఉద్యోగానికి దరకాస్తు చేశాడు. చివరకు అనుకున్న డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. కష్టపడి చదివి తొలుత పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం సాధించాడు. దానితో సరిపెట్టుకోకుండా తర్వాత గురుకులంలో పీజీటీ ఉద్యోగం సాధించాడు. ఏఎస్‌వో జాబ్ కొట్టాడు. గురుకులంలో టీజీడీ జాబ్‌కుడా సాధించాడు. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్–2 ఉద్యోగం సాధించాడు. తాజాగా గ్రూప్–4, డీఎస్సీ, జేఎల్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. చివరకు పీజీటీ సోషల్ టీచర్‌గా మల్లంపల్లిలో పనిచేస్తున్నాడు. అన్న రాజేశ్ స్ఫూర్తితో తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్–4 ఉద్యోగం సాధించాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. మెయిన్స్ రాశాడు.
ఎందరికో స్ఫూర్తి..
చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఆలా మందికి కల. దాని కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. అన్నీ వదలుకుని ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఉద్యోగం రాగానే సంతృప్తి పడుతున్నారు. కానీ రాజేశ్ లాంటివారు మాత్రం ఉన్నదానితో సంతృప్తి పడడం లేదు. తమలోని ప్రతిభను బయట పెట్టడానికి కష్టపడుతున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూరిత్గా నిలుస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rayakula rajesh from warangal district has done 8 government jobs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com