Madras High Court
Madras High Court : యువతీ యువకులు ప్రేమలో ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం ఈ మధ్య కామన్ అయ్యాయి. లింగ్ టుగెదర్ అంటూ కొందరు అయితే పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఇద్దరూ మేజర్లు అయితే.. ఇద్దరూ అంగీకారంతో కలిసి ఉండడం తప్పు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో తీర్పు ఇచ్చింది. సహజీవనాన్ని తప్పు పట్టలేమని తెలిపింది. ఇక పెళ్లి తర్వాత శారీరక కలయిక విషయంలో బలవంతం మాత్రం నేర అని గతంలో తీర్పు ఇచ్చింది. ఇలా భిన్న తీర్పులు ఉండగా, తాజాగా ప్రేమికులు హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడాన్ని నేరంగా పరిగణించలేమని తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రేమించుకున్న సమయంలో చేసుకున్న హగ్గులు, పెట్టుకున్న ముద్దులపై సదరు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది.
యువతి ఫిర్యాదు..
తమిళనాడుకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తర్వాత యువతి యువకుడిపై పొలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 నవంబర్‌లో ఒక రోజు రాత్రి తామిద్దరం కలుసుకున్నామని ఆ సమయంలో యువకుడు తనను హగ్ చేసుని ముద్దు పనెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు తాజాగా మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చింది. ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ప్రేమలో ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం సాధారణమే అని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్.. ఐపీసీ సెక్షన్354–అ(1)(జీ) కింద వీటిని నేరంగా పరిగణించడం కుదరదని తీర్పు చెప్పింది. యువతి ఫిర్యాదును కొట్టేసింది.
నేరాల గురించి కీలక వ్యాఖ్యలు..
తీర్పు సందర్బంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏవి నేరాలో వెల్లడించింది. ముందుగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీక సంబంధం పెట్టుకోవడం, లైంగికంగా మోసం చేయడం వంటివి చట్ట ప్రకారం నేరంగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ ఇష్టపూర్వకంగా ý లిశారని, టీనేజ్ ప్రేమల్లో హగ్‌లు, కిస్‌లు సహజమని తెలిపింది. ఇద్దరూ ఏకాభిప్రాయంతో సంబంధం పెర్టుకుని తర్వాత తగాదాలు వచ్చి విడిపోయిన తర్వాత కేసులు పెట్టడాన్ని తప్పు పట్టింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Madras high courts sensational verdict that hug and kiss is not a crime
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com