Constipation Problem: మలబద్ధకాన్ని దూరం చేసే ఆహారాలేంటో తెలుసా?

మలబద్ధకం సమస్య ఉన్న వారు నారింజ పండ్లు ఎక్కువగా తినాలి. ఇందులో ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టుకోవచ్చు. అరటిపండు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆపిల్, కివీ, ద్రాక్ష పండ్లు కూడా మలబద్ధకానికి చెక్ పెడతాయి. వీటిని తరచుగా తీసుకోవాలి.

Written By: Srinivas, Updated On : June 26, 2023 2:02 pm

Constipation Problem

Follow us on

Constipation Problem: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీంతో మన కడుపు ఉబ్బరం, అజీర్తి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు వేధిస్తాయి. మలబద్ధకం సమస్య ఉంటే మనసంతా కడుపు మీదే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమే. మలవిసర్జన జరిగే సమయంలో ఒక్కోసారి రక్తం కూడా పడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య లేకుండా చేసుకోవడమే మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది

మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుందంటే నీరు తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య దరిచేరుతుంది. మనిసి కనీసం రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. లేకపోతే మలబద్ధకం సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం తినే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే ఈ సమస్య సోకుతుంది. మానసిక రుగ్మతలు ఉండడం వల్ల కూడా మలబ్ధకం ఉంటుంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా వస్తుంది. జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ లు తింటే కూడా ఇది బాధిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ప్రతి గంటకు ఒకసారి అటు ఇటు నడుస్తుండాలి. వ్యాయామం చేస్తుండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. ధూమపానం, మద్యపానం చేయరాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఏ పండ్లు తినాలి

మలబద్ధకం సమస్య ఉన్న వారు నారింజ పండ్లు ఎక్కువగా తినాలి. ఇందులో ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టుకోవచ్చు. అరటిపండు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆపిల్, కివీ, ద్రాక్ష పండ్లు కూడా మలబద్ధకానికి చెక్ పెడతాయి. వీటిని తరచుగా తీసుకోవాలి.

మలబద్ధకాన్ని దూరం చేసే చిట్కా

ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో టీ స్పూన్ వాము పొడిని వేసుకుని నిమ్మరసం పావు టీ స్పూన్ తీసుకుని కలుపుకోవాలి. తరువాత పావు టీ స్పూన్ శొంఠి పొడిని కలుపుకోవాలి. అలాగే తేనె ఒక స్పూన్ వేసుకోవాలి. వీటన్నింటిని కలుపుకోవాలి. డయాబెటిస్ వారు తేనెను షుగర్ లెవల్స్ బట్టి వేసుకోవాలి. వాముపొడి, నిమ్మరసం, శొంఠి, తేనె ఇవన్ని మలబద్ధకం సమస్యను లేకుండా చేస్తాయి. ప్రతి రోజు ఏదో సమయంలో ఓ అర టీ స్పూన్ వరకు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.