BP Control Diet : ఇటీవల కాలంలో రక్తపోటు అందరిని బాధిస్తోంది. దీంతో చాలా రకాల నష్టాలున్నాయి. బీపీతోపాటు షుగర్ కూడా రావడం కామనే. అందుకే ఇవి రెండు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. అధిక రక్తపోటు వల్ల మన ఒంట్లో అవయవాలకు ప్రమాదం ఏర్పడుతోంది. గుండె జబ్బులు రావడానికి ఎక్కువగా రక్తపోటే కారణం. ఈ నేపథ్యంలో రక్తపోటును ఎలా కంట్రోల్ చేసుకోవాలనేదానిపై అందరికి చొరవ ఉండటం సహజమే.
అధిక రక్తపోటును నియంత్రించడంలో సుగంధ ద్రవ్యాలు బాగా ఉపయోగపడతాయి. వంటింట్లో ఉండే వీటితో బీపీ అదుపులోకి రావడం జరుగుతుంది. దీనికి వాటిని మనం తినడమే. దీంతో బీపీ కంట్రోల్ లోకి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఏమేం వాడాలో కూడా ఓ సారి పరిశీలించుకుంటే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
బీపీని కంట్రోల్ చేయడంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఉల్లిసిన్ అనే సమ్మేళనం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. తులసిలో కూడా ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. రక్తపోటును తగ్గించడంలో తులసి సాయపడుతుంది. తులసిలోని ముఖ్యమైన నూనెలు శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
దాల్చిన చెక్కలో కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచే గుణాలున్నాయి. అధిక రక్తపోటు, షుగర్ ను కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క దోహదపడుతుంది. యాలకులు కూడా రక్తపోటును తగ్గిస్తాయి. బీపీ ఉన్న వారు మూడు నెలల పాటు రోజు 1.5 గ్రాముల యాలకులు రోజుకు రెండుసార్లు తీసుకుంటే దాన్ని నియంత్రిస్తాయి. అల్లం కూడా మనకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీని అదుపులోకి తెస్తుంది.