https://oktelugu.com/

Green Tea : అధికంగా గ్రీన్ టీ తాగితే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

గ్రీన్ టీలో ఉండే టానిన్ తలనొప్పి వచ్చేలా చేస్తుంది. అధిక మొత్తంలో గ్రీన్ టీ తాగితే వాంతులు, కళ్లు తిరగడం, ఎక్కువగా తలనొప్పి వంటివి వస్తాయి. అలాగే కాలేయం మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రోజుకి ఒకటి నుంచి రెండు కప్ ల గ్రీన్ టీ మాత్రమే తాగాలి. అంత కంటే ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 10, 2024 / 06:29 AM IST

    Green Tea

    Follow us on

    Green Tea :  ఆరోగ్యానికి మంచిది అని చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళలో గ్రీన్ టీని ఎక్కువగా తాగుతుంటారు. ఈ టీ తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అలాగే రోగానిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది అని గ్రీన్ టీని అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీని రోజూ మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అలాగే శరీరంలో పొటాషియం, కాల్షియం వంటి పోషకాలను కూడా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు తొందరగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల బోలు ఎముకుల వ్యాధి వంటివి వస్తాయి. కాబట్టి గ్రీన్ టీని అతిగా తాగవద్దు. చాలా మంది ఉదయాన్నే ఏమి తినకుండా గ్రీన్ టీ తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల కొందరికి కడుపులో మంట వస్తుంది. అలాగే గ్యాస్టిక్, ఎసీడీటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. అధిక మొత్తంలో గ్రీన్ టీ తాగుతున్న వాళ్లకి నిద్రలేమి వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే కెఫిన్ నిద్ర రాకుండా చేస్తుంది. కెఫిన్ వల్ల మెదడుకి రక్తం సరఫరా కాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

    గ్రీన్ టీలో ఉండే టానిన్ తలనొప్పి వచ్చేలా చేస్తుంది. అధిక మొత్తంలో గ్రీన్ టీ తాగితే వాంతులు, కళ్లు తిరగడం, ఎక్కువగా తలనొప్పి వంటివి వస్తాయి. అలాగే కాలేయం మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రోజుకి ఒకటి నుంచి రెండు కప్ ల గ్రీన్ టీ మాత్రమే తాగాలి. అంత కంటే ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ గ్రీన్ టీ మొక్కలను ఫ్లోరైడ్​ అధికంగా ఉండే ప్రాంతాల్లో పెంచుతారు. దీనివల్ల గ్రీన్ టీలో అధికంగా ఫ్లోరైడ్​ ఉంటుంది. అయితే ఈ టీని ఎవరు ఎక్కువగా తాగుతారో వాళ్లకి ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల దంతాలు, ఎముకల రంగు మారి.. బలహీనంగా తయారవుతాయి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కొందరిలో ఉదర సమస్యలు కూడా వస్తాయి. రక్త పోటు కూడా అధికంగా పెరుగుతుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి. లేకపోతే కొందరిలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గ్రీన్ టీ జోలికి వెళ్లకపోవడం మంచిది. అలాగే మందులు వాడుతున్నవాళ్లు కూడా గ్రీన్ టీ తాగక పోవడం మంచిది. డాక్టర్ ను సంప్రదించిన తరువాత తీసుకోవడం మంచిది. లేకపోతే సమస్యలు తప్పవు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.