Baldness: పూర్వం రోజుల్లో వెంట్రుకలు ముసలితనం వచ్చే వరకు కూడా ఊడిపోయేవి కావు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు పాతికేళ్లకే బట్టతల వస్తోంది. ఫలితంగా బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారాలే మనకు ఈ నష్టాలు వచ్చేందుకు కారణమవుతున్నాయి. బట్టతల వచ్చిందంటే నలుగురిలో తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అంటారు వెంట్రుకలు ఉన్న కొప్పు ఎటేసినా అందంగానే ఉంటుందన్నట్లు ప్రస్తుతం జుట్టు సమస్య అందరిని వేధిస్తోంది.
నలభై ఏళ్లు దాటాయంటే అందరు తలలు బోడులుగా మారుతున్నాయి. జుట్టంతా ఊడిపోయి నున్నగా మారుతోంది. తలలు బోడులైనా తలపులు బోడులవునా అన్నట్లుగా మారింది పరిస్థితి. ఈ క్రమంలో బట్టతల గురించి బాధ పడితే లాభం లేదు. మనం తినే ఆహారంతోనే జుట్టు రాలిపోతోంది. చిన్న వయసులోనే బట్టతల సమస్య బాధిస్తోంది.
బట్టతల మగవారికే ఎందుకొస్తుంది? జుట్టు రాలే సమస్య ఇద్దరికి ఉంటుంది. కానీ బట్టతల మాత్రం ఒకరికే వస్తుంది. మగ వారికి బట్టతల రావడానికి కారణాలంటే తెలుసుకుంటే పురుషుల్లో బట్టతల సమస్య రావడానికి టెస్టోస్టిరాన్ కారణంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతోనే మగవారికి బట్టతల వస్తుందని చెబుతున్నారు.
టెస్టోస్టిరాన్ డీ హైడ్రేడ్ టెస్టోస్టిరాన్ గా మారడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. ఫలితంగా వెంట్రుకలు మెల్లమెల్లగా రాలిపోయి బట్టతలగా మారుతుంది. పెళ్లికాని వారికి అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. వివాహం కావాలంటే వెంట్రుకలు లేకపోతే ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు. దీంతో బట్టతల వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలిసినా సమస్య నుంచి తప్పించుకోవడానికి కుదరడం లేదు.