Y. S. Sharmila: వైఎస్ఆర్సీపీ టీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవల రాజకీయంగా దూకుడు పెంచారు. తెలంగాణలో ఏర్పడుతున్న సమస్యలపై ఆమె పోరాటాలు ఉధృత స్థాయికి చేరుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన ఆమె ప్రతీ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అవసరమైతే దీక్షలు,ధర్నాలు చేపడుతూ కల్లోలం సృష్టిస్తున్నారు.మొన్న ఆమె నిర్వహించిన పాదయాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో ఆమె మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి ఫలితంగా ఆమె కార్వాని బస్సును కొందరు తగలబెట్టారు. తన బస్సును బీఆర్ఎస్ నాయకులే తగలబెట్టారని ఆమె ఆరోపించారు. తాజాగా ఆమె టీఎస్పీసీ కార్యాలయానికి వెళ్లే క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన డైలాగ్ కు పోలీసులు షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలతో షర్మిల పరువు పోయిందని అంటున్నారు.
వైఎస్ఆర్సీపీ టీ పార్టీతో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నషర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. పాదయాత్రతో జిల్లాలు చుట్టిన ఆమె ప్రజలతో మమేకమైపోతున్నారు. ఓ వైపు ప్రజల బాగోగులు తెలుసుుంటూనే మరోవైపు అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి సంచలన కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల వారిపై ఒక్కోసారి పరుష వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీలో అవకతవకలు రాష్ట్రంలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు లీకేజీ కావడంతో కొందరు నిందితులను తీసుకొని విచారిస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల సైతం తన అనుచరులతో టీఎస్పీఎస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకుదు బయలు దేరారు.
ఈ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారిపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ‘మీకేం పని లేకపోతే గాడిదలను కాసుకోండి.. ’ అంటూ కామెంట్ చేశారు. దీంతో అక్కడున్న పోలీసుల్లో ఒకరు ‘మేం అదే చేస్తున్నాం..’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కొందరు అప్లోడ్ చేశారు. ఇక్కడ జరిగిన పరిణామాలతో మొత్తంగా షర్మిల పరువే పోయిందని కొందరు అంటున్నారు. మరి మీరు కూడా ఆ వీడియో చూసేయండి..