https://oktelugu.com/

Coriander : కొత్తిమీర వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

Coriander : మనం రోజు తీసుకునే ఆహారాల్లో ఆకు కూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందులో ఉండే ప్రొటీన్లతో మన ఆరోగ్యం దెబ్బతినకుండా చేస్తాయి. ఇందులో కొత్తిమీర కూడా ఒకటి. కూరల్లో సువాసన కోసం వేసుకుంటున్నా దీంతో ఎన్నో ఆరోగ్య పోషకాలు దాగి ఉన్న సంగతి విధితమే. దీన్ని రోజు తినడం వల్ల ఆయుర్వేదంలో చెప్పినట్లు మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి. వాత, పిత్త కఫ దోషాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 1, 2023 / 10:39 AM IST
    Follow us on

    Coriander : మనం రోజు తీసుకునే ఆహారాల్లో ఆకు కూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందులో ఉండే ప్రొటీన్లతో మన ఆరోగ్యం దెబ్బతినకుండా చేస్తాయి. ఇందులో కొత్తిమీర కూడా ఒకటి. కూరల్లో సువాసన కోసం వేసుకుంటున్నా దీంతో ఎన్నో ఆరోగ్య పోషకాలు దాగి ఉన్న సంగతి విధితమే. దీన్ని రోజు తినడం వల్ల ఆయుర్వేదంలో చెప్పినట్లు మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి. వాత, పిత్త కఫ దోషాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తిమీరకు ఎంతో విలువ ఉందని చెబుతుంటారు.

    జీర్ణశక్తి

    జీర్ణశక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఆకలిని పెంచేస్తుంది. మనం తిన్న పదార్థాలు త్వరగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. జఠర రసాలు ఉత్పత్తి చేసి జీర్ణక్రియ మెరగయ్యేలా చేస్తుంది. శరీరంలో చేరే మలినాలను దూరం చేయడంలో ఇది తోడ్పడుతుంది. వాటి వల్ల దుష్ర్పభావాలను దూరం చేస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు ఉదయం కొత్తిమీర జ్యూస్ తాగితే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.

    హార్మోన్ల అసమతుల్యత

    ఇటీవల కాలంలో హార్మోన్ల అసమతుల్యతతో ఇబ్బందులు వస్తున్నాయి. యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీని నుంచి కాపాడేది కొత్తిమీర ఒకటే కావడం గమనార్హం. కొత్తిమీర రసం తాగితే మనకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ , ఎసిడిటి వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు ప్రతిరోజు కొత్తిమీర తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. కొత్తిమీరతో కూరలకు రుచే కాదు మనకు కూడా పలు రకాల లాభాలు కలిగిస్తుంది. అందుకే కొత్తిమీరను అన్ని వంటల్లో భాగం చేసుకుంటే ఉత్తమం.

    వైరస్ లను దూరం చేస్తుంది

    కొత్తిమీర తీసుకోవడం వల్ల మనకు పలు రకాల మేలు కలుగుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తిమీర తినడం వల్ల శరీరంలో వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకుంటుంది. ఇలా కొత్తిమీర తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలో కొత్తిమీరను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది. కొత్తిమీరతో చాలా రకాల ఉపయోగాలు ఉండటంతో మనం విడిచిపెట్టకుండా దాన్ని తీసుకోవడం శ్రేయస్కరం.