
Aishwarya Rai Daughter Aaradhya: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా అందగత్తె అనే టాపిక్ వస్తే ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. మోడలింగ్ రంగం లో అద్భుతంగా రాణించి మిస్ యూనివర్స్ టైటిల్ ని గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన ఇరువుర్( ఇద్దరు) అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన నటన తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఐశ్వర్య రాయ్ కి ఆ తర్వాత వరుసగా తమిళం , తెలుగు మరియు హిందీ బాషలలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆమె మూడవ సినిమా శంకర్ తెరకెక్కించిన ‘జీన్స్’ అనే చిత్రం.ఈ సినిమా అప్పట్లో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇక్కడ నుండి ఐశ్వర్య రాయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుసగా ఎన్నో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి.కానీ ఎక్కువ శాతం ఈమెకి అవకాశాలు బాలీవుడ్ లోనే వచ్చాయి. అక్కడే ఈమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. అప్పట్లో ఈమె ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపిన ఘటన బాలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు అతనితో బ్రేకప్ అయిపోయింది,బాలీవుడ్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ తో ప్రేమాయణం నడిపి 2007 వ సంవత్సరం లో పెళ్లయింది.
వీళ్లిద్దరికీ ఆరాధ్య బచ్చన్ అనే కూతురు కూడా ఉంది.ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అచ్చు గుద్దినట్టు అమ్మ పోలికలతో ఉన్న ఆరాధ్య బచ్చన్ ని చూసి నెటిజెన్స్ అందరూ అమ్మని మించిన అందం అని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.ఆమెకి సంబంధించిన ఫోటోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Aishwarya Rai and Aaradhya Bachchan at Ambani's function 😍#AishwaryaRaiBachchan #PonniyinSelvan2 pic.twitter.com/GrTICiEiDp
— Empress Aishwarya Fan (@badass_aishfan) March 31, 2023