Kitchen Design: ఇంటికి వంట గది ముఖ్యమే. వంట గదిలోనే మనం తినే ఆహారాలు సమకూర్చుకుంటాం. అందుకే వాస్తు ప్రకారం వంట గదిలో అన్ని ఉండేలా చూసుకోవాలి. ఏది తగ్గినా మనకు ప్రతికూల ప్రభావాలు వస్తాయి. దీంతో కిచెన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో స్పష్టమైన స్ఫష్టతో ఉండాలి. అప్పుడే మనకు నష్టాలు రాకుండా ఉంటాయి. ఈ నేపథ్యంలో వంట గది ప్రాధాన్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకుండా మంచి అవగాహనతో ఉండే సరి. లేకపోతే నష్టాలే.
వంటగదిలో గ్యాస్ స్టవ్, వాష్ బేసిన్, రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులు ఎలా అమర్చుకోవాలనేదాని మీద కూడా మనకు తెలిసి ఉండాలి. లేదంటే ఒకదాని స్థలంలో మరొకటి పెడితే మనకు తిప్పలు తప్పవు. అందుకే ఇంట్లో వాస్తు ప్రకారం వంటగదిని అమర్చుకోవాలి. ఎందుకంటే నిత్యం వంట గదిలో పని ఉంటుంది. ఏ వస్తువును ఎక్కడ ఉంచుకోవాలో తెలుసుకుంటేనే మంచిది.
వాష్ బేసిన్ లోని నీళ్లు సక్రమంగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం అగ్నిదేవుడు ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచుకోవాలి. వంట గది నైరుతి, వాయువ్యం, ఈశాన్యం దిశల్లో ఉంచుకోవడం సరికాదు. దీంతో వాస్తు దోషం ఏర్పడుతోంది. వంట గదిలో ఏర్పాటు చేసుకునే వస్తువులు సరైన విధంగా ఉండేలా చూడాలి. అప్పుడే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది.
వంట గది వెలుపల మనం వాడే నీరు బయటకు ఆగకుండా వెళ్లాలి. నీరు ఎక్కడ ఆగినా మనకు అరిష్టమే. ఇలా వంట గది ఏర్పాటులో ఎన్నో రకాల చర్యలు తీసుకోవాలి. వంటగదిలో వస్తువుల అమరిక సక్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. వంటగదిలో ఉండే వాటిని మంచి పద్ధతుల్లో అమర్చుకుని వాస్తు దోషాలు లేకుండా చూసుకుని మనకు కష్టాలు లేకుండా చూసుకోవడం మంచిది.