https://oktelugu.com/

MLA Kannababu : వైసీపీ ఎమ్మెల్యే.. కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ లేరక్కడ

అసమ్మతి కార్యకర్తలు నేతలు చుట్టుముట్టడంతో ఎమ్మెల్యే కన్నబాబు రాజులో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో తనను ప్రశ్నిస్తూ తన వెనకాలే వస్తున్న నేత చెంపపై ఎమ్మెల్యే కొట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 1, 2023 / 05:47 PM IST
    Follow us on

    MLA Kannababu : అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు పథకాలు రూపంలో పంచిపెడుతున్నామని.. ఇక అంతా సవ్యంగా సాగిపోతుందన్న ధీమాతో ఉన్న వారికి మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రజలు సమాధానమిస్తున్నారు. అటు ఎన్నికల ముంచుకు రావడం, నాలుగేళ్లు కరిగిపోవడంతో సొంత పార్టీ శ్రేణులు నుంచి సైతం అసంతృప్తులు బయటపడుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ఇటువంటి నిరసన సెగే ఎదురైంది. తన దురుసుతనంతో ఎమ్మెల్యే ఒకరి చెంప మీద కొట్టగా .. గ్రామస్థులంతా చుట్టుముట్టారు. పోలీసు వలయంలో ఆయన బయటపడాల్సి వచ్చింది.

    గతంలో యువకుడిపై దాడికి యత్నం..
    ఎమ్మెల్యే కన్నబాబురాజుది చాలా దూకుడు స్వభావం. అయినదానికి కానిదానికి నోరు పారేసుకుంటారు. చేయికి పనిచెబుతుంటారు. కొద్దిరోజుల కిందట నియోజకవర్గంలో గడపగడపకూ కార్యక్రమం చేపడుతుండగా.. ఓయువకుడి నుంచి ప్రతిఘటన ఎదురైంది. అభివృద్ధి జరగడం లేదని సదరు యువకుడు ప్రశ్నించేసరికి కళ్లు పీకేస్తానంటూ కన్నబాబురాజు ఆ యువకుడిపై దాడిచేసినంత పసనిచేశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. కన్నబాబురాజు తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన తీరును నెటిజన్లు తప్పుపట్టారు.

    నిలదీసిన పార్టీ శ్రేణులు..
    అయితే ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల నుంచే ఆయనకు నిరసన సెగ తగిలింది. ఆయనకు సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కన్నబాబు రాజును అసమ్మతి నేతలు నియోజకవర్గ పర్యటనలో అడ్డుకున్నారు. తాజాగా తనపై అసమ్మతి వ్యక్తం చేసిన సొంత పార్టీ నేతపై బహిరంగంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.అచ్యుతాపురం మండలం పూడిమడకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనను నిలదీశారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడంలో పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆయనను చుట్టముట్టారు. ఆయనను ఎంతోకష్టం మీద పోలీసులు బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు.

    చెంప చెల్లుమనిపించిన వైనం..
    అయినా సరే భారీ సంఖ్యలో అసమ్మతి కార్యకర్తలు నేతలు చుట్టుముట్టడంతో ఎమ్మెల్యే కన్నబాబు రాజులో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో తనను ప్రశ్నిస్తూ తన వెనకాలే వస్తున్న నేత చెంపపై ఎమ్మెల్యే కొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కన్నబాబు అరాచకాలు జగన్ వరకూ చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దందాలను అరికట్టాలని.. ఆయన అరాచకాలు అడ్డుకోవాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే తప్పులు చేస్తారు.. చేయిస్తారంటూ ప్లకార్డులు తీసుకొచ్చి నిరసనకు దిగారు. ఇప్పుడిది విశాఖ వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కన్నబాబురాజును మార్చకుంటే యలమంచిలి స్థానం వదులుకోవాల్సిందేనని సొంత పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.