Jio Cinema: HBO కూడా ఎంట్రీ.. ఓటీటీలో జియో సినిమాకు ఇక తిరుగులేదు.. అంబానీకి ఎదురేలేదు..

ఇండియాలో అత్యధిక చందాదారులతో హాట్ స్టార్ మార్కెట్ లీడర్ గా ఉంది. తర్వాత స్థానం అమెజాన్ ప్రైమ్ ది. సోనీ లివ్, జీ 5, నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ ఫైవ్ లో ఉన్నారు. పదుల సంఖ్యలో లోకల్ యాప్స్ ఈ రంగంలో పోటీపడుతున్నాయి.

Written By: Shiva, Updated On : April 28, 2023 9:36 am
Follow us on

Jio Cinema: భవిష్యత్తు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ దే. అందుకే పలు కార్పొరేట్ కంపెనీలు OTT(ఓవర్ ది టాప్) రంగంపై దృష్టి సారించాయి. గత ఐదేళ్ల కాలంలో పదుల సంఖ్యలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుట్టుకొచ్చాయి. ఇంటర్నేషనల్, నేషనల్ ఓటీటీ సంస్థలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఊహించని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా లాక్ డౌన్ పరిస్థితులు ప్రేక్షకులను ఓటీటీలకు అలవాటు పడేలా చేశాయి. ప్రేక్షకుల అభిరుచి మారింది. వెయ్యి రూపాయలతో ఏడాది పాటు ఇంట్లో కూర్చుని సినిమా చూసేయొచ్చనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. ఇంటిల్లిపాది థియేటర్ కి వెళ్లే రోజులు పోయాయి.

ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ పోటీ ఉంటుంది. ఓటీటీ ఇప్పుడు హాట్ బిజినెస్. పట్టణ ప్రాంతాల నుండి పల్లె ప్రాంతాలకు ఓటీటీ కల్చర్ పాకింది. పెరిగిన జీవన ప్రమాణాల నేపథ్యంలో లక్షల విలువ చేసే టెలివిజన్స్ లో బిగ్ స్క్రీన్ కి ఏమాత్రం తగ్గని అనుభవంతో జనాలు సినిమాలు చూస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఎట్రాక్ట్ కావడానికి మరొక కారణం… అన్ని రకాల కంటెంట్ ఒక చోట దొరకడం. హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు సినిమాలు, సీరియల్స్, స్పోర్ట్స్, గేమ్ షోస్, రియాలిటీ షోస్… వాట్ నాట్, సర్వం ఒక్క చోట అందిస్తుంది.

ఇండియాలో అత్యధిక చందాదారులతో హాట్ స్టార్ మార్కెట్ లీడర్ గా ఉంది. తర్వాత స్థానం అమెజాన్ ప్రైమ్ ది. సోనీ లివ్, జీ 5, నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ ఫైవ్ లో ఉన్నారు. పదుల సంఖ్యలో లోకల్ యాప్స్ ఈ రంగంలో పోటీపడుతున్నాయి. ముకేశ్ అంబానీ స్థాపించిన జియో సినిమా తన మార్కెట్ షేర్ పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇండియాలో టాప్ ప్లేయర్ గా అవతరించాలని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందు వెళుతుంది.

ఓటీటీ రంగంలో రాణించాలంటే రెండు విషయాల్లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. ఒకటి కంటెంట్ కాగా రెండోది సబ్స్క్రిప్షన్ ఛార్జ్. తక్కువ ధరకు ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయగలితే మార్కెట్ లీడర్స్ కావచ్చు. ఈ సూత్రాలను పాటిస్తూ జియో సినిమా భారీగా పెట్టుబడి పెడుతుంది. అంతర్జాతీయ కంటెంట్ తన చందాదారులకు ఫ్రీగా అందిస్తుంది. గత ఏడాది జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాలు ఉచితంగా జియో సినిమా అందించింది. తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. HBO కంటెంట్ అందుబాటులోకి తెస్తుంది. హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం అవుతున్న HBO కంటెంట్ ని తన చందాదారులకి అందించనుంది.

అలాగే జియో సినిమాలో ఐపీఎల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియాలో అత్యంత డిమాండ్ కలిగిన ఈ టోర్నీ ప్రసారాలు ఉచితంగా అందిస్తూ జియో సంచలనాలు నమోదు చేస్తుంది. సమీపకాలంలో జియో సినిమా అంచనాలకు మించి ఎదిగే సూచనలు కలవు. ఇంటర్నేషనల్ ఫ్లాట్ ఫార్మ్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.