https://oktelugu.com/

Kids Food : పిల్లలకు రోజులో ఎన్నిసార్లు తినిపిస్తే ఆరోగ్యంగా ఉంటారో మీకు తెలుసా?

బిజీ లైఫ్‌ వల్ల చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు రోజులో రెండు లేదా మూడుసార్లు మాత్రమే భోజనం పెడతారు. అది కూడా వాళ్లకు ఏదైనా వర్క్ ఉంటే.. తొందరగా ఏదో కొంచెం పిల్లలకు పెడతారు. వాళ్లు తింటే తింటారు. లేకపోతే లేదని వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం రిస్క్‌లో పడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2024 / 04:02 AM IST

    Kids Food

    Follow us on

    Kids Food : పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్లకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా చాలా కేర్‌గా ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్లకు బలమైన ఆహారం పెట్టాలని ప్రయత్నిస్తారు. సాధారణంగా చిన్న పిల్లలు ఏడాది తర్వాత అన్నం వంటివి తింటారు. అది కూడా మెత్తగా చేసి పెడితేనే వాళ్లకు జీర్ణం అవుతుంది. అయితే చిన్న పిల్లలు తినడానికి అంతగా ఇష్టపెట్టుకోరు. తల్లిదండ్రులే వాళ్లకు బలవంతంగా ఆహారం పెడుతుంటారు. బలవంతంగా పెట్టడం మంచిదే. కానీ రోజు అదే విధంగా ఎక్కువగా పెట్టడం అంత మంచిది కాదు. కాస్త ఏదో తక్కువగా కొంచెం పెడితే పర్లేదు. అదే ఎక్కువగా పెడితే కొన్నిసార్లు వాళ్లు వాంతులు చేసే ప్రమాదం ఉంది. అయితే సాధారణంగా పిల్లలు అనే కాకుండా పెద్దలు అందరూ కూడా మూడు పూజలు భోజనం చేస్తారు. ఎవరో ఒకరు బాగా ఆకలి వేసి నాలుగు లేదా ఐదు పూటలు తింటారు. ఈరోజుల్లో అయితే ఫ్యాషన్‌గా మారి చాలామంది కేవలం రెండు పూటలు మాత్రమే ఫుడ్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా డైట్ అని చెప్పి తక్కువగా రెండు పూటలు మాత్రమే తింటున్నారు. కొంతమంది వాళ్ల పిల్లలకు కూడా రెండు పూటలు మాత్రమే ఆహారం పెడుతుంటారు. ఇలా పిల్లలకు రెండు పూటలు మాత్రమే భోజనం చేయించడం వాళ్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్ల వరకు పక్కన పెడితే.. అసలే వాళ్లు చిన్న పిల్లలు. ఎక్కువగా ఫుడ్ పెట్టాలి. ఎల్లప్పుడూ కూడా కడుపు నిండుగా ఉండేలా చూసుకోవాలి. మరి రోజులో పిల్లలకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాలో చూద్దాం.

    బిజీ లైఫ్‌ వల్ల చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు రోజులో రెండు లేదా మూడుసార్లు మాత్రమే భోజనం పెడతారు. అది కూడా వాళ్లకు ఏదైనా వర్క్ ఉంటే.. తొందరగా ఏదో కొంచెం పిల్లలకు పెడతారు. వాళ్లు తింటే తింటారు. లేకపోతే లేదని వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం రిస్క్‌లో పడుతుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలకు తప్పకుండా మీరే దగ్గర ఉండి భోజనం పెట్టాలి. మూడు పూటలు కాకుండా నాలుగు నుంచి ఐదు పూటలు పిల్లలకు భోజనం పెట్టాలి. అయితే ఒక్కసారిగా ఎక్కువ ఆహారం పెట్టకుండా కొంచెం కొంచెంగా పిల్లలకు భోజనం పెట్టాలి. అప్పుడే అది వాళ్ల ఒంటికి పడుతుంది. దీంతో వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల కడుపు ఎక్కువ సమయం ఖాళీగా ఉండకూడదు. గంట గంటకీ వాళ్లకు ఏదో ఒకటి కొంచెం తినిపిస్తూ ఉండాలి. వాళ్లకు తినడం ఇష్టం లేకపోయిన సరే.. వాళ్లకు తినిపించాలి. అప్పుడే పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పటి నుంచే రోజుకి నాలుగు పూటలు తినడం అలవాటు చేయాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.