https://oktelugu.com/

Credit Card: బ్యాంకు వారు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం లేదా? అయితే మీకు రోజుకు రూ.500 వస్తాయి..

క్రెడిట్ కార్డు ఉన్న వారు రెగ్యులర్ గా వాడుకోవాలి. అయితే కార్డు లిమిట్ లో ఉన్న 30 శాతం వరకు వాడుకుంటేనే ఎలాంటి నష్టం ఉండదు. కొందరు 80 శాతం వరకు వాడుకుంటారు. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోరు పై ప్రభావం పడుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2024 4:41 pm
    Credit Cards

    Credit Cards

    Follow us on

    Credit Card: సామాన్యుల నుంచి ధనిక వర్గాల వరకు దాదాపు చాలా మంది క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారు. వస్తువుల కొనుగోలుతో పాటు కార్డు లిమిట్ ద్వారా రుణం తీసుకునే అవకాశం ఈ కార్డు కల్పిస్తుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు పొందాలంటే సాధ్యం అయ్యేపని కాదు. కానీ ఇప్పుడు బ్యాంకు ఖాతా ఉన్నవారు దాదాపు క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు. అయిేత క్రెడిట్ కార్డు వల్ల ఎంత ప్రయోజనం ఉందో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. దీనిని సరిగ్గా వాడుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. నిర్లక్ష్యం చేయడం వల్ల భారీగా నష్టాలను ఎదుర్కొంటారు. అత్యవసర సమయంలోనూ ఉపయోగపడే క్రెడిట్ కార్డు ను ఒక్కోసారి క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తే రూ. 500 వినియోగదారులకు ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే…

     

    క్రెడిట్ కార్డు ఉన్న వారు రెగ్యులర్ గా వాడుకోవాలి. అయితే కార్డు లిమిట్ లో ఉన్న 30 శాతం వరకు వాడుకుంటేనే ఎలాంటి నష్టం ఉండదు. కొందరు 80 శాతం వరకు వాడుకుంటారు. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోరు పై ప్రభావం పడుతుంది. అందువల్ల తక్కువ లిమిట్ ను యూజ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు బిల్లును గడువులోపే చెల్లించాలి. ఒక్కసారి ఫెనాల్టీ కట్టాల్సి వస్తే కూడా సిబల్ స్కోర్ తక్కువగా పెరుగుతుంది. ఇక కార్డును పక్కన పడేయకుండా ఎంతో కొంత వాడుతూ ఉండాలి. లేకపోతే ఇది హోల్డ్ లో పడి కార్డు పనిచేయకుండా ఉంటుంది.

    అయితే ఒక్కోసారి కొన్ని సమస్యల వల్ల కార్డును క్లోజ్ చేయాల్సి వస్తుుంది. క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ముందుగా బ్యాంకుకు వెళ్లి ఒక ఫాం నింపాలి. సంబంధిత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇచ్చిన 7 రోజుల లోపు కార్డును క్లోజ్ చేస్తారు. అయితే ఇక్కడ బ్యాంకు అధికారులు గనుక నిర్లక్ష్యంగా ఉంటే వారు ఖాతాదారులకు ఫెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ ఫెనాల్టీ ఎలా ఉంటుందంటే.. వారం రోజులు అంటే 7 రోజుల వరకు కార్డును ఖాతాదారుడు ఇచ్చిన సమాచారం కరెక్ట్ గా ఉంటే క్లోజ్ చేయాలి. లేని పక్షంలో ఆ తరువాత అంటే 8వ రోజు నుంచి ఎన్ని రోజుల డిలే చేస్తే.. ప్రతీ రోజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ బ్యాంకు ఖాతాదారుడి కార్డ్ క్లోజ్ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తుందో.. అప్పుడు వారికి డబ్బులు ఇవ్వాలని గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఈ ప్రకారంగా కొన్ని బ్యాంకులు చెల్లించడానికి నిరాకరిస్తే.. అంబుడ్స్ మెన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రెడిట్ కార్డును సాధ్యమైనంత వరకు క్లోజ్ చేయాలని చెప్పండి. ఒకవేళ ఎక్కువ రోజులు కార్డుక్లోజ్ చేయకపోయినా ఇది హ్యాక్ కు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డు విషయంలో బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తే ఇలా అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయొచ్చు.