https://oktelugu.com/

Sleep : నిద్రలేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్య నిద్రలేమి. పాఠశాలకు వెళ్లే పిల్లల నుంచి పనిచేసే యువత, ముసలి ఇలా అందరు కూడా ఈ సమస్యతో బాధ పడుతున్నారు. సరైన నిద్ర రాక, నిద్ర పట్టక బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. చిన్నప్పుడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయం చూస్తూ, కోడి కూత వినడం కామన్ గా జరిగేది కదా. కానీ ఇప్పుడు పొద్దున్నే లేటుగా లేవడం. మనం లేవడానికి కూడా మొబైల్ అలారాలను ఉపయోగించడం కామన్ గా జరుగుతుంది. అయితే కార్పొరేట్ రంగంలో పనిచేసే చాలా మందికి అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు పని చేస్తున్నారు. ఇలా రాత్రి వరకు పని చేసి కూడా నిద్రకు ఇబ్బంది కలిగిస్తుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 4, 2024 / 01:41 PM IST

    Sleep Psoriasis:

    Follow us on

    Sleep : ఇలా పని చేసే వారి సమయం సరిగ్గా లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే చాలా మంది బరువు , నొప్పి, ఎర్రటి కళ్ళతో కూడిన సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. అంతేకాదు అసంకల్పితంగా కనురెప్పలు, కండరాల నొప్పులు, అవయవాలలో నొప్పి వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. ఇలాంటి సమస్యలతో ఉన్నవారికి బ్రెయిన్, లింబ్ స్కాన్ నార్మల్ గా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్యలు మొత్తం కూడా నిద్ర లేమి వల్లనే వస్తాయట. ఈ విషయంలో, నాడీ వ్యవస్థపై నిద్రలేమి ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ సమస్యను అధిగమిస్తే నాడీ ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చు.

    కొంతమంది సాధారణంగా నిద్రపోలేక పోతున్నారు. ఎందుకంటే చీకటిలో ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్లను ఉపయోగించడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది . నిద్ర-మేల్కొనే చక్రాలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రపోయే ముందు బ్రష్ చేయడం వంటి కొన్ని అలవాట్ల వల్ల నిద్ర త్వరగా పడుతుంది. ఇలాచేస్తే నిద్ర పోవడం ఆలస్యం కాదు. ముఖ్యంగా పడుకోవడానికి కొన్ని గంటల ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. చాలా రోజులు సరిగా నిద్రపోలేకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మూడ్ సమస్యలు వస్తుంటాయి. తగినంత నిద్ర లేనప్పుడు, శరీరం ఒత్తిడికి ఎక్కువ గురి అవుతుంటుంది. ఇది మొత్తం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది

    పేలవమైన నిద్ర వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. ఈ నిద్రలేమి స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పని తీర్లను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, నిద్ర లేమి ఏకాగ్రతలో ఇబ్బంది, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను తెస్తుంది. నిద్ర భంగం జరిగితే రోగనిరోధక శక్తి ప్రభావితం అవుతుంది. శరీరం కూడా బలహీనపడుతుంది. నిద్రలేమి ఉన్నవారు నాడీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంటువ్యాధులు , వాపులకు ఎక్కువగా గురవుతారు అంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు నిద్ర లేకపోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. రక్తపోటు, వాస్కులర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.