Alcohol Side Effects: మద్యపానం ఎంత తీవ్రమైనదో తెలిసినా ఎవరు పట్టించుకోవడం లేదు. తాగుడు అలవాటుతో కుటుంబం మొత్తం బాధలు పడుతున్నా ఎంజాయ్ మెంట్ పేరుతో పురుషులు ఫుల్ గా తాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కట్టుకున్న భార్య ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. తమ భర్త తాగుడుకు బానిస కావడంపై ఆందోళన చెందుతున్నారు. మద్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణమవుతుంది. అనేక రోగాలకు మూలంగా మారుతుంది.
కానీ ఎన్ని బాధలు వచ్చినా మాత్రం మద్యం తాగే అలవాటును మాత్రం మానడం లేదు. ఫలితంగా వ్యాధులకు దగ్గరవుతున్నారు.
వృద్ధాప్యం మీద పడుతున్న కొద్ది ఒంట్లో నీరు తగ్గిపోతుంది. దీంతో దాహం వేయటం కూడా తక్కువ అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గుతుండటంతో రోగాలు కూడా చుట్టుముడతాయి. ఒంట్లో నీరసం, నిసత్తువ ఆవహిస్తాయి. ముఖకళ మారుతుంది. ఫలితంగా ముసలి వారిలా కనిపిస్తాం. దీనికి తోడు మద్యం తీసుకుంటే మనకు ఇబ్బందులు కలుగుతాయి.
మద్యం తాగితే ఒంట్లో నీరు బయటకు వెళ్లేలా చేస్తుంది. దీని వల్ల దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. శరీరంపై ముడతలు పెరుగుతాయి.
మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయానికి కొవ్వు పడుతుంది. కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. మెదడు మొద్దుబారేలా చేస్తుంది. అతిగా మద్యం తాగితే మెదడు కణాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. మద్యం విపరీత ప్రభావాలకు దారి తీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేలా చేస్తుంది.
వృద్ధాప్యంలో మద్యం తలనొప్పి సమస్యకు దారి తీస్తుంది. మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు, జీర్ణాశయ పుండ్లు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. వయసు మీద పడుతున్న కొద్ది అన్ని రకాల వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అతిగా మద్యం తాగితే శరీరం నియంత్రణ పట్టు కోల్పోతోంది. మెదడులోని సెరిబెల్లం దెబ్బతింటుంది. మద్యం తాగడం వల్ల ఇన్ని అనర్థాలున్నందున దాన్ని తీసుకోకపోవడమే మేలు అని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.