Bigg Boss 6 Telugu Winner Revanth: బిగ్ బాస్ తెలుగు 6 టోటల్ డిజాస్టర్. షో నడిచిన తీరు వరస్ట్ అనుకుంటే ఫినాలే అంతకంటే వరస్ట్ గా ముగిసింది. టైటిల్ విన్నర్ ఎవరో చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. రేవంత్ టైటిల్ గెలుచుకున్నప్పటికీ శ్రీహాన్ అసలు విన్నర్ అని హోస్ట్ నాగార్జున చెప్పడం మొత్తంగా ముంచేసింది. ఆడియన్స్ లో రేవంత్, శ్రీహాన్ లపై గౌరవం పోయింది. రియల్ విన్నర్ శ్రీహాన్ అనే బాధ రేవంత్ లో, అయ్యో తొందరపాటుతో టైటిల్ కోల్పోయానే అనే వేదన శ్రీహాన్ లో ఉండిపోయింది. ఇద్దరూ సమానంగా డబ్బులు పంచుకున్నప్పటికీ సంతోషం లేదు.

ముఖ్యంగా రేవంత్ బాధ వర్ణనాతీతం. హోస్ట్ నాగార్జున ఇచ్చిన ఝలక్ నుండి అతడు కోలుకోలేదు. టైటిల్ విన్నర్ ని నేనే అంటూ బయటకు గాంభీర్యం ప్రదర్శిస్తూ నవ్వు మేకప్ వేసుకున్నాడు కానీ, లోలోపల బాధపడుతున్నాడు. హౌస్లో రేవంత్ పలికిన ప్రగల్భాలకు వచ్చిన ఫలితానికి పొంతన లేదు. ప్రతి విషయంలో నేను తోపు అని రేవంత్ ఫీల్ అయ్యాడు. అతడి మాట తీరు, ప్రవర్తన చాలా రూడ్ గా ఉండేది. ఇండియన్ ఐడల్ విన్నర్ గా, స్టార్ సింగర్ గా ఎంతో ఫేమ్ ఉన్న రేవంత్ శ్రీహాన్ చేతిలో ఓడిపోయాడు.
ఫినాలే ముగిసిన వెంటనే పాల్గొన్న ఇంటర్వ్యూలో రేవంత్ చెప్పిన డైలాగ్… ఈ టైటిల్ ఎలా వచ్చింది? ఏ కారణాలతో వచ్చింది? అనేది నేను పట్టించుకోను. నేను టైటిల్ కొట్టాలి అనుకున్నాను, కొట్టాను. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ నా చేతిలో ఉంది అన్నాడు. శ్రీహాన్ రూ. 40 లక్షల ఆఫర్ తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకోవడం వలెనే నేను గెలిచాను, అనేది ఒప్పుకోనని పరోక్షంగా రేవంత్ చెప్పాడు. కానీ నిజం అదే. టైటిల్ కోసం పోటీ పడిన శ్రీహాన్ సూట్ కేసు ఆఫర్ ఒప్పుకోకుండా… ఫైనల్ లో రేవంత్ విన్నర్ అని నాగార్జున ప్రకటిస్తే కథ వేరేగా ఉండేది. అప్పుడు రేవంత్ కి విజయగర్వం మిగిలేది. హుందాగా టైటిల్ విన్నర్ నేను అంటూ తలెత్తుకు తిరిగేవాడు.

ఈ నేపథ్యంలో రేవంత్ ఇంటర్వ్యూలలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదట. మీడియాకు ముఖం చాటేస్తున్నాడట. ఇంటర్వ్యూలో పాల్గొంటే కచ్చితంగా శ్రీహాన్ ప్రస్తావన వస్తుంది. అతడు నాగార్జున ఆఫర్ తీసుకోవడం వలనే మీరు విన్ అయ్యారనే విషయం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే బాధిస్తున్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం ఇష్టం లేక రేవంత్ ఇంటర్వ్యూ లకు దూరంగా ఉంటున్నారని బయట టాక్.