https://oktelugu.com/

Cashew Nut : రోజుకి ఎన్ని జీడిపప్పులు తినాలో మీకు తెలుసా?

జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అంత కంటే ఎక్కువగా తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పుని రోజుకి కొంత మోతాదులో మాత్రం తింటేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మరి రోజుకి ఎన్ని జీడిపప్పులు తినాలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 1, 2024 / 11:40 PM IST

    Cashew Nut

    Follow us on

    Cashew Nut : డ్రైఫ్రూట్స్‌లో రారాజైన  ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. డైలీ వీటిని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పుష్కలంగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పును చాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు తినడానికి ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తింటే వీటిని తినకుండా ఉండలేరు. అలా వాళ్లకు తెలియకుండానే ఆటోమెటిక్‌గా తినేస్తుంటారు. కొంచెం తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అంత కంటే ఎక్కువగా తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పుని రోజుకి కొంత మోతాదులో మాత్రం తింటేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మరి రోజుకి ఎన్ని జీడిపప్పులు తినాలో తెలుసుకుందాం.

    జీడిపప్పులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, కాపర్, విటమిన్లు, జింక్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే రోజుకి 5 నుంచి 10 జీడిపప్పులు మాత్రమే తినాలి. అంత కంటే ఎక్కువగా జీడిపప్పులు తింటే ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రొటీన్ వల్ల శరీరానికి ఆరోగ్యమైన కొవ్వులు ఏర్పడతాయి. తక్కువగా తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ అధికంగా తింటే కొవ్వు ఏర్పడటం, అలర్జీ, కడుపు నొప్పి, వాంతులు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పును చాలామంది వంటల్లో వాడుతారు. కొందరు నెయ్యి లేదా సాధారణంగా నూనెలో వేపి తింటుంటారు. వీటిని నానబెట్టి తిన్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో వీటిని ఎక్కువగా తినడం వల్ల బాడీకి వేడి చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

    డైలీ జీడిపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నరాలు బలంగా ఉండటంతో పాటు కండరాల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌లు జీవక్రియను నియంత్రిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, ఫాస్పరస్ చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. రోజూ జీడిపప్పును తినడం వల్ల అంధత్వ సమస్యలు రాకుండా ఉండటంతో పాటు, కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకి ఒక ఐదు జీడిపప్పులను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని లినోలెయిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.