The GOAT Trailer : గోట్ ట్రైలర్ ఒకే…కానీ డైరెక్టర్ మార్క్ మిస్ అయిందా..? ఇంకేదో తేడా కొడుతుందబ్బాయి..?

తమిళం లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి విజయ్ కి ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి...రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా విజయ్ గారే కావడం విశేషం...

Written By: Gopi, Updated On : August 17, 2024 7:43 pm

Thalapathy Vijay The GOAT Trailer Review

Follow us on

The GOAT Trailer  : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో వెంకట్ ప్రభు ఒకరు. ముఖ్యంగా ఈయన తీసిన ‘మానాడు ‘ సినిమా ప్రేక్షకులందరిలో విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేసింది. ఇక అంతకుముందు అజిత్ తో చేసిన గ్యాంబ్లర్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక గ్యాంబ్లర్ సినిమా తమిళ్, తెలుగు రెండు భాషల్లో మంచి విజయాన్ని సాధించడంతో ‘వెంకట్ ప్రభు’ ఒకసారిగా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ శింబు హీరోగా చేసిన ‘ మానాడు ‘ అనే సినిమాతో తనను తాను ఒక మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక గత సంవత్సరం నాగచైతన్యతో చేసిన ‘కస్టడీ ‘ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ విజయ్ వెంకట్ ప్రభు తో గోట్ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో విజయ్ ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు.

అయితే ట్రైలర్ ను యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసినప్పటికీ ఫాదర్ అండ్ సన్స్ మధ్య ఉండే ఒక ఎమోషన్ బాండింగ్ మీద సినిమాను నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక విజయ్ రెండు పాత్రలో అదరగొట్టబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వెంకట్ ప్రభు గురించి చూసుకుంటే ఈయన సినిమాల్లో ఒక మేజర్ పాయింట్ ను రేజ్ చేస్తు ఆ టెంప్లేట్ లోనే సినిమా మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ గోట్ సినిమాని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఏదో ఒక ఎమోషన్ ను హుక్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక కస్టడీలో కూడా ఒక విలన్ ని పట్టుకోడానికి హీరో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అదంతా ఎంగేజింగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేదు. మరి ఈ సినిమా విషయంలో కూడా అలాంటిదే జరగబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ లో ఆ విషయం మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది.ఇక ఇదిలా ఉంటే ఎక్కడ కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఇవ్వకుండా గందరగోళంగా చూపించాడు. ఇక అటు తండ్రిని ఇటు కొడుకుని చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు.

ముఖ్యంగా యంగ్ విజయ్ క్యారెక్టర్ కోసం వేసిన మేకప్ అయితే చాలా దరిద్రంగా ఉందనే చెప్పాలి. విజయ్ అసలు అ లుక్ లో ఏమి బాలేడు ఎందుకు అలాంటి లుక్ ను ఎంచుకున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ లో పెద్దగా ఎంగేజింగ్ చేసే పాయింట్లైతే ఏమీ కనిపించలేదు. ఇక ఈ సినిమా కూడా రొటీన్ ఫార్ములా లోనే వస్తుంది కాబట్టి ఆడితే సంతోషం, పోతే విజయ్ కెరియర్ లో మరొక సినిమా ప్లాప్ అయిందని చెప్పుకోవడం తప్ప పెద్దగా ఒరిగేదేమి లేదు…