https://oktelugu.com/

Exercise : వ్యాయామంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

మనకు వచ్చే అన్ని రోగాలకు ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. రోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి మాయం అవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 / 05:19 PM IST
    Follow us on

    Exercise : ప్రస్తుత రోజుల్లో వ్యాయామం ఓ అలవాటుగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందుకే వాకింగ్, వ్యాయామం, జాగింగ్ లు చేస్తున్నారు. తమ ఒంట్లో ఉన్న రోగాలను నయం చేసుకునేందుకు వ్యాయామం బాగా ఉపకరిస్తుందని తెలుసుకుని తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. రోజుకో గంట కేటాయించుకుని మరీ వ్యాయామం చేస్తున్నారు. ఫలితంగా రోగాలు లేని విధంగా మన శరీరం తయారవుతుందనడంలో సందేహం లేదు.

    అధిక రక్తపోటు

    ఈ రోజుల్లో అధిక రక్తపోటు అందరిని బాధిస్తోంది. దీన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే వ్యాయామం తప్ననిసరి. దీంతో బీపీని నియంత్రణలో ఉంచేందుకు వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో బీపీని అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర ఇబ్బందులు వస్తాయి. వీటికి దూరంగా ఉండాలంటే వ్యాయామం చేయడం మంచిది.

    మధుమేహం

    మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీని వల్ల చాలా మంది ఎన్నో రకాల తిప్పలు పడుతున్నారు. మందులు మింగుతూ జీవితాంతం షుగర్ ను మనతోనే ఉండేలా చేసుకుంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎంతో మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

    ఒత్తిడి

    మనకు వచ్చే అన్ని రోగాలకు ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. రోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి మాయం అవుతుంది. దీనికి మంచి ఆహారంతో పాటు వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. దీంతో మానసికంగా మంచి పట్టు సాధించి తీరుతాం. ఈ క్రమంలో వ్యాయామం చేయడం మంచి అలవాటుగా చెబుతారు.