Vitamin P: విటమిన్ పి గురించి మీకు తెలుసా? దీని అవసరం చాలా ఉందట

ఈ విట‌మిన్ పి అనేది క‌చ్చితంగా విట‌మిన్ కాదంటారు నిపుణులు. ఫ్లేవనాయిడ్స్‌ని విట‌మిన్ పి అంటారట. ఫ్లేవ‌నాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీలు క‌లిగిన ఒక ఫైటో న్యూట్రియంట్ అని అర్థం.

Written By: Swathi, Updated On : May 26, 2024 12:29 pm

Vitamin P

Follow us on

Vitamin P: విటమిన్లు ప్రతి ఒక్కరి శరీరానికి చాలా అవసరం. కొన్నింటి గురించి అందరికీ తెలిసి ఉంటే కొన్నింటి గురించి తెలియదు. ఇక తెలియని విటమిన్ అంటే ముఖ్యంగా విటమిన్‌-పి గురించి చెప్పవచ్చు. విట‌మిన్ A, B, C, D ఈ వ‌ర‌కు త‌ర‌చూ తెలుసుకుంటాం. కానీ ఈ పి విటమిన్ ఏంటి అనుకుంటున్నారా? విటమిన్ P లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను వస్తాయట. కాబట్టి, విటమిన్‌ పి కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే ఈ విటమిన్ పి అంటే ఏమిటి.? అది ఏ ఆహారాలలో దొరుకుతుంది..? దాని ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విట‌మిన్ పి అనేది క‌చ్చితంగా విట‌మిన్ కాదంటారు నిపుణులు. ఫ్లేవనాయిడ్స్‌ని విట‌మిన్ పి అంటారట. ఫ్లేవ‌నాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీలు క‌లిగిన ఒక ఫైటో న్యూట్రియంట్ అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే ఈ విట‌మిన్ పి అనేది ఎక్కువ‌గా మొక్క‌ల నుంచి ల‌భించే ఆహార ప‌దార్థాల‌లో లభిస్తుంటుంది. ఇక బయోఫ్లేవనాయిడ్ లోపం లక్షణాలు విటమిన్ సి మాదిరిగానే ఉంటాయి. దీని లోపం తెలియాలి అంటే ముఖ్యంగా గాయాలు, రక్తస్రావం వల్ల తెలుసుకోవచ్చట.

ఈ పి విటమిన్ లేకపోతే దెబ్బతగిలిన చోట తీవ్రమైన రక్తస్రావం జరుగుతుందట. దీని లోపం ఆర్థరైటిస్‌కు సంబంధించిన వాపు కూడా వస్తుంది అంటారు నిపుణులు. దీని తీవ్రమైన లోపం వల్ల స్కర్వీ, చిగుళ్లు, దంతాల సమస్యలు, చర్మం, జుట్టు పొడిబారడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే విట‌మిన్ పి తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం పదిలం అవుతుంది. ర‌క్త‌నాళాల ప‌నితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. విట‌మిన్ పి అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది కాబ‌ట్టి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరగడంలో తోడ్పడుతుంది. ఆస్తమా, కీళ్ల‌వాతం, అలెర్జీలను రాకుండా ముందే నివారిస్తుంది.

వారికోస్ వీన్స్, చ‌ర్మంపై క‌మిలిన‌ట్లు అవుతుంటాయి కొన్ని సార్లు ఇలాంటి సమస్యలను రాకుండా నివారిస్తుంది విటమిన్ పి. అంతేకాదు కంటి శుక్లాలు రాకుండా చూపు త‌గ్గ‌కుండా చేస్తుంది. బ్రెయిన్ ప‌నితీరును మెరుగుపరుస్తుంది. కొన్ని ర‌కాల క్యాన్స‌ర్లను అడ్డుకుంటుంది. అయితే ఈ విటమిన్ పి నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటుంది. హై క్వాలిటీ డార్క్ చాక్లెట్‌లో కూడా ఇది ల‌భిస్తుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా బెర్రీ జాతికి చెందిన పండ్ల‌లో కూడా ఇది ల‌భిస్తుంది.