Rabies Symptoms: మనుషులపై ఇటీవల కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిన చిన్న పిల్లలు.. పెద్దవారు అని చూడకుండా కొన్ని శునకాలు మనుషులపై దాడికి దిగి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీలో రేబిస్ వ్యాధి ప్రబలించడంతో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెంపుడు జంతువులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందారు. అయితే పెంపుడు జంతువులు అయినా ఒకసారి మనుషులను కరిస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని.. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎలాంటి చికిత్స ఉండదని వైద్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రేబిస్ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించి.. చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. మరి రేపు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే?
తాజాగా ఒక కుక్క గోరు వ్యక్తికి గుచ్చుకోవడం వల్ల అతను రేబిస్ వ్యాధి బారిన పడ్డాడు. అంటే కుక్కకు సంబంధించిన ఎలాంటి దాడి అయిన మనుషుల్లో తీవ్రమైన రేబిస్ వ్యాధి ప్రభలే అవకాశం ఉంది. అందువల్ల రోడ్డు మీద ఉండే కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుక్కలు గుంపులుగా ఉంటే సింగిల్ గా మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ గుంపులుగా కుక్కలు ఉంటే మనుషులు కొందరు కలిసి వాటిని దూరం ఉంచే ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలను రోడ్డుపైకి సింగిల్ గా పంపకూడదు. కుక్కల దాడి తీవ్రంగా ఉంటే ఆ ప్రదేశంలో కర్రలతో వెళ్లడం మంచిది.
ఇక పెంపుడు కుక్కల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పెంపుడు కుక్కలకు సమయాన్ని బట్టి టీకాలు వేయించాలని.. ఎప్పుడూ వాటిని శుభ్రంగా ఉంచాలని తెలుపుతున్నారు. వాటిలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే అవి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే కుక్కలతో సరదాగా కూడా నోట కనిపించుకోవడం.. వాటి లాలాజలాన్ని తాకడం వంటివి చేయకుండా ఉండాలి. వాటి ద్వారా మనుషుల శరీరాల్లోకి వైరస్ వ్యాపించే అవకాశం ఉంది.
అయితే కుక్క చిన్నపాటి దాడి చేసినా కూడా రేబిస్ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి వస్తుందని తెలిసే క్రమంలో తీవ్రంగా జ్వరం వస్తుంది. అలాగే తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. బలహీనత ఉండడం.. నీటిని చూడగానే భయపడడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు వచ్చిన వారిని వెంటనే సమీప ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. అంతకంటే ముందే కుక్క కరిచిందని అనుమానం ఉంటే వైద్యుల నుంచి సరైన వ్యాక్సిన్ వేసుకోవాలి. ముందు జాగ్రత్తగా కొన్ని వాక్సిన్లు కూడా ఉంటాయి. వీటిని పెద్దవారితో పాటు పిల్లలు కూడా వేసుకోవడం మంచిది. అలాగే కుక్క కరిసిన సమయంలో కూడా వెంటనే చికిత్స తీసుకునే ప్రయత్నం చేయాలి. కుక్క కరిచిన నెల లేదా రెండు నెలల లోపు రేబిస్ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి చికిత్స పనిచేయకుండా మరణమే ఉంటుంది. అందువల్ల రేబిస్ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి.