మిగిలిపోయిన ఆహారాన్ని తింటున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?

మనలో చాలామంది రాత్రి సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తరువాత రోజు తింటూ ఉంటారు. అయితే మిగిలిపోయిన ఆహారంను తినవచ్చా? తినకూడదా? అనే సందేహం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్య నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైద్య నిపుణులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహారంను […]

Written By: Navya, Updated On : November 2, 2021 8:57 am
Follow us on

మనలో చాలామంది రాత్రి సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తరువాత రోజు తింటూ ఉంటారు. అయితే మిగిలిపోయిన ఆహారంను తినవచ్చా? తినకూడదా? అనే సందేహం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్య నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వైద్య నిపుణులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహారంను తీసుకోకూడదు. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి తింటూ ఉంటారు. ఆహారాన్ని వేడి చేసి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు, విటమిన్లు నాశనమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఒకరోజు కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహారం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంటుంది. వండిన వెంటనే ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. ఆహారంను ఎక్కువ సమయం ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా, ఇతర క్రిములు ప్రబలే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మిగిలిపోయిన ఆహారం వల్ల ఆరోగ్యానికి హాని తప్ప మేలు జరగదు.

మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల ఇతర వ్యాధులు కూడా ప్రబలే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అందువల్ల మిగిలిపోయిన ఆహారంను తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.