Eating spicy food: ప్రతిరోజు మనం తినే ఆహారంలోనే అసలైన ఆరోగ్యం ఉంటుందని కొందరు నిపుణులు తెలుపుతూ ఉంటారు. క్రమ పద్ధతిన ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధులను దరిచేయకుండా చేయవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆహారం ఎక్కువగా కల్తీ అవుతుంది. మార్కెట్లో దొరికే ఆహార వస్తువులు కూడా కల్తీగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదని అంటున్నారు. వీటిలో ముఖ్యంగా ఎర్రకారం తినడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తాయని కొందరు చెబుతున్నారు. వాస్తవానికి ఎర్ర కారం తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అసలు ఎర్ర కారం తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజు వండే కూరలో కొన్ని రకాల పదార్థాలు వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. వీటిలో మసాలాలతోపాటు ఎర్ర కారం కచ్చితంగా ఉండాలని అంటున్నారు. ఎర్ర కారం తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని దశాబ్దాల కిందటే గుర్తించారు. అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతికూరలో ఎర్రకారం తప్పనిసరిగా వాడుతున్నారు. అంతేకాకుండా ఇది వేయడం వల్ల కూర రుచిగా ఉంటుంది.
రక్తపోటును నియంత్రించడంలో ఎర్రకారం ఎంతో ఉపయోగపడుతుంది. ఎర్రకారంలో అధికంగా పొటాషియం ఉంటుంది.. ఇది కొత్త ప్రసరణ మెరుగ్గా ఉండేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంతో రక్తపోటు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఎర్రకారం తప్పనిసరిగా ఉండాలని అంటున్నారు. ప్రస్తుత కాలంలో బరువు సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. మీరు బరువు తగ్గడానికి అనేక రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. కానీ ప్రతిరోజు కూరలో ఎర్రకారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండడంవల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఎర్రకారంలో capsysin అనే పదార్థం ఉంటుంది. ఇది జీవ క్రియను పెంచడానికి తోడ్పడుతుంది. ఎర్ర కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి.
Also Read: వారానికి ఒక గ్లాస్ బీర్ తాగితే ఎంత మంచిదంటే?
రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. నీ రోగనిరోధక శక్తి పెరగడానికి ఎర్రకారం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సి విటమిన్ శరీరంలో శారీరక రుగ్మతలను దూరం చేస్తుంది. అంతేకాకుండా నిత్యం యాక్టివ్ గా ఉండడానికి ఎర్ర కారం ఎంతో సహకరిస్తుంది. నీటి కలుషితం వల్ల జుట్టు రాలే సమస్య ఎదుర్కొంటున్నారు. దీని పరిష్కారానికి ఎర్రకారం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా ఎర్ర కారం తినడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇందులో ఉండే ఏ విటమిన్ జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు ఉన్నవారు ఎర్ర కారం దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకంతో బాధపడే వారికి కూడా ఇది ఔషధంలా పనిచేస్తుంది.
చాలామంది ఎర్రకారం వల్ల అల్సర్ వస్తుంది అని భయపడుతూ ఉంటారు. అయితే కారం కూడా మితంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అతిగా వాడితే అల్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.